షావోమి సంస్థ, భారతీయ వినియోగదారుల యొక్క అవసరాలకు తగిన మరియు అతితక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చే వాటిలో ముందు వరసలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సమవత్సరంలో, ఇప్పటివరకూ అనేక ప్రత్యేకతలతో బడ్జెట్ ధరలో పెద్ద కెమేరాతో మరియు మంచి ప్రాసెసర్ మరియు గొప్ప సెల్ఫీ కెమెరా వంటి అనేకరకాలైన ప్రత్యేకతలతో, అనేకరకాల స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది.
Survey
✅ Thank you for completing the survey!
అయితే, ఇప్పుడు తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకురానున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ టీజింగ్ ప్రకారం, 'Smart Deah ka Smartphone' అనే క్యాప్షన్ తో ఈ స్మార్ట్ ఫోన్ను గురించిన వివరాలను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో జూలై 4 వ తేదీన విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్లు ప్రకటించింది.
ఇక కొత్తగా రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించిన వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ను పెద్ద మరియు ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, వినియోగధారులను ఆకట్టుకునేలా ఉండే కెమేరా మరియు వేగవంతమైన ప్రాసెసర్ వంటి గొప్ప ఫీచర్లతో తీసుకురానున్నట్లు చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్, ఇన్ని ప్రత్యేకతలు కలిగివున్నా కూడా ధర మాత్రం చౌకగానే ఉండనున్నట్లు అంచనాలు వేస్తున్నారు.