అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి ఈరోజు భారీ డీల్స్ ను ప్రకటించింది. వన్ ప్లస్ లేటెస్ట్ 5G మొబైల్ OnePlus Nord CE 2 Lite 5G పైన ఈ సేల్ నుండి గొప్ప డీల్స్ పొందవచ్చు. వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్ ఫోన్ పైన 1,000 డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా ఈ సేల్ నుండి అఫర్ చేస్తోంది. మరి ఈ వన్ ప్లస్ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డీల్స్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Nord CE 2 5G: అఫర్
వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ.19,999 ధరతో అమ్మడువుతుండగా, ఈ ఫోన్ ను రూ.1000 రూపాయల డిస్కౌంట్ తో రూ.18,999 రూపాయల ప్రారంభ ధరతో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సేల్ నుండి RBL క్రెడిట్ మరియు Citi బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది Buy From Here
వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.
ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile