HIGHLIGHTS
Nokia G20 స్మార్ట్ ఫోన్ పైన ప్రైమ్ డే సేల్ అఫర్
అమెజాన్ సేల్ నుండి 1,000 రూపాయల కూపన్
భారీ ఎక్స్ చేంజ్ కూడా పొందవచ్చు
ఇండియాలో రీసెంట్ గా విడుదలైన Nokia G20 స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ మంచి ఆఫర్లను అందించింది. Nokia G20 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.12,999 రూపాయల ధరతో వచ్చింది. అయితే, అమెజాన్ సేల్ నుండి 1,000 రూపాయల కూపన్ మరియు HDFC కస్టమర్లు 10% డిస్కౌంట్ వంటి లాభాలను పొందవచ్చు. Nokia G20 స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి 12 వేల రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ కూడా పొందవచ్చు. Buy from Here
Surveyనోకియా జి 20 స్మార్ట్ ఫోన్ 4×2.3 GHz, 4×1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.
నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో, కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.