జబర్దస్త్ ఆఫర్: 25 వేలకే Flip Phone అందుకునే చాన్స్ మిస్సవ్వకండి.!
కొత్త Flip Phone డిస్కౌంట్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకు లభిస్తోంది
ఈ ఆఫర్ ను ఈరోజు అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది
అమెజాన్ ఆఫర్ చేస్తున్న జబర్దస్త్ ఫ్లిప్ ఫోన్ ఆఫర్
జబర్దస్త్ ఆఫర్: భారత మార్కెట్ లో ఇటీవల విడుదలైన కొత్త Flip Phone డిస్కౌంట్ , భారీ కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ AMOLED స్క్రీన్, భారీ కెమెరా సెటప్ మరియు వేగవంతమైన ఛార్జ్ వంటి చాలా ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఆఫర్ ను ఈరోజు అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ ఆఫర్ పై ఒక లుక్కేయండి.
Surveyఏమిటా Flip Phone జబర్దస్త్ ఆఫర్?
ప్రముఖ మొబైల్ కంపెనీ TECNO ఇటీవల విడుదల చేసిన ఫోల్డ్ ఫోన్ TECNO Phantom V Flip 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. టెక్నో ఈ ఫ్లిప్ ఫోన్ ను రూ. 54,899 రూపాయల ధరలో అందించింది. అయితే, ఈ ఫోన్ పైన అమెజాన్ ఇండియా ఈ రోజు రూ. 25,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ తో రూ. 29,899 రూపాయల ధరకే ఆఫర్ చేస్తోంది.
అదేంటి 25 వేలకు ఈ ఫోన్ లభిస్తుంది అని అన్నారు? అని మీకు డౌట్ రావచ్చు, అక్కడికే వస్తున్నా. ఈ ఫోన్ పైన భారీ బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ 25 వేల కంటే తక్కువ ధరకే అందుకునే ఛాన్స్ ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను IDFC First బ్యాంక్ క్రెడిట్ కార్డు EMI తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 5000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను 25 వేల రూపాయల కంటే తక్కువ ధరలో అందుకునే చాన్స్ అందించింది. Buy From Here
Also Read: BSNL : 160 రోజులు డైలీ 2 GB డేటా మరియు అన్లిమిటెడ్ అందించే టాప్ ప్లాన్.!
TECNO Phantom V Flip 5G (Flip Phone) : ఫీచర్స్
ఈ టెక్నో ఫ్లిప్ ఫోన్ లో 6.9 ఇంచ్ Flexible AMOLED మరియు 1.32 ఇంచ్ సెకండరీ AMOLED స్క్రీన్ ఉంటాయి. ఈ ఫోన్ 3D కర్వుడ్ లెథర్ డిజైన్ తో మరింత ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ Dimensity 8050 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ + 8GB అదనపు ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 64MP అల్ట్రా క్లియర్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4000mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Hi-Res ఆడియో సపోర్ట్ కూడా వుంది.
బడ్జెట్ ధరలో ఫ్లిప్ ఫోన్ కొరుకునే వారికి ఈ టెక్నో ఫ్లిప్ ఫోన్ డీల్ మంచి డీల్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile