OnePlus Nord CE4 భారీ డిస్కౌంట్ తో 20 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు చాలా చవక ధరకు అందుకునే అవకాశం వుంది

అమెజాన్ కొత్తగా ప్రకటించిన ‘Fab Phone fest’ సేల్ నుంచి ఈ గొప్ప డీల్ ను ఆఫర్ చేస్తోంది

OnePlus Nord CE4 భారీ డిస్కౌంట్ తో 20 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది.!

OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ అందుకుని 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు చాలా చవక ధరకు అందుకునే అవకాశం వుంది. అందుకే ఈ బెస్ట్ డీల్ ను అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE4 ఆఫర్ ఏమిటి?

అమెజాన్ కొత్తగా ప్రకటించిన ‘Fab Phone fest’ సేల్ నుంచి ఈ గొప్ప డీల్ ను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ యొక్క నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ ఫోన్ ఫ్యాబ్ ఫస్ట్ సేల్ నుంచి OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 19,999 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here

Also Read: BSNL తక్కువ ధరలో ఆఫర్ చేస్తున్న బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేద్దామా.!

OnePlus Nord CE4 : ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్, 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ఆక్వా టచ్ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప విజువల్స్ అందించే Pro XDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

OnePlus Nord CE4 Offer

ఈ ఫోన్ లో వెనుకాడ ఉల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP SONY LYT-600 మెయిన్ మరియు 8MP సోనీ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 100W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo