అమెజాన్ సేల్ నుండి Mi 11X 5G ఫోన్ పైన భారీ డీల్స్

అమెజాన్ సేల్ నుండి Mi 11X 5G ఫోన్ పైన భారీ డీల్స్
HIGHLIGHTS

హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి Mi 11X 5G పైన భారీ డీల్స్

ఇటీవల షియోమి లేటెస్ట్ గా ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసిన Mi 11X 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి భారీ డీల్స్ తో లభిస్తోంది. ఈ ఫోన్ పైన అందించిన 2,000 రుపాయల డిస్కౌంట్ తో పాటుగా, 3,500 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా పొందేవీలుంది. ఈ ఫోన్ బెస్ట్ ఫీచర్లతో  మార్కెట్లో అడుగుపెట్టింది. మరి ఈ ఫోన్ పైన అందించిన ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా..!   

Mi 11X 5G: అఫర్ ధర మరియు డీల్స్

లాంచ్ సమయంలో ఈ ఫోన్ రూ.29,999 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, అమెజాన్ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.27,999 రూపాయలకే లభిస్తోంది. అధనంగా,  Citi బ్యాంక్ మరియు Axis బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్ పైన రూ. 3,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ పైన పూర్తిగా 5,500 రూపాయల డిస్కౌంట్ ఈ సేల్ నుండి పొందవచ్చు.    

Mi 11X 5G: ప్రత్యేకతలు

Mi 11X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వుంటుంది మరియు ఇది E4 AMOLED డిస్ప్లే. ఇది 1300 నైట్స్ బ్రైట్నెస్ అందించగలదు.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 7nm ఫ్యాబ్రికేషన్ ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది MIUI 12 ఆధారితంగా వస్తుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, Mi 11X  వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్   f/1.79 అపర్చర్ తో అందించింది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్ మరియు 5MP టెలీ మ్యాక్రో సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 20MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 4,520 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W  ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo