అమేజాన్ నుండి FAB Phones Fest : స్మార్ట్ ఫోన్ల పైన 40% వరకూ డిస్కౌంట్లతో రేపటి నుండి మొదలు

అమేజాన్ నుండి FAB Phones Fest : స్మార్ట్ ఫోన్ల పైన 40% వరకూ డిస్కౌంట్లతో రేపటి నుండి మొదలు
HIGHLIGHTS

సేల్ నవంబర్ 26 నుండి 29 వ తేది వరకూ జరగనుంది.

అమేజాన్ ఇండియా మరొకసారి తన FAB Phones Fest ని ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 26 నుండి 29 వ తేది వరకూ జరగనుంది. ఈ సేల్ నుండి అనేకమైన ప్రముఖ బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ మొబైల్ ఫోన్ల పైన గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఇటీవల విడుదలైన వివో U20, రెడ్మి నోట్ 8, రెడ్మి నోట్ 8 ప్రో మరియు నోకియా 6.2 వంటి స్మార్ట్ ఫోన్ల యొక్క ఫ్లాష్ సేల్స్ ని కూడా అందిస్తోంది మరియు వాటిపైన మరిన్ని ఆఫర్లను కూడా ఇవ్వనుంది.

ఈ సేల్ నుండి, ప్రతీ ఒక్కరూ ఫోన్లను కొనుగోలు చేసేందుకు వీలుగా, NO Cost EMI, ఎక్స్చేంజి అఫర్ మరియు టోటల్ డామేజి ప్రొటెక్షన్ వంటి మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. అయితే, ఈ సేల్ నుండి అమ్ముడు చెయ్యనున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను మాత్రం సాయంత్రం 6 గంటలకు తెలియచేయనునట్లు ప్రకటించింది.

కానీ, ఇందులో OnePlus, షావోమి, శామ్సంగ్, వివో, నోకియా, ఒప్పో, రియల్మీ, హానర్ మరియు హువావే వంటి అన్ని ప్రధాన బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ సామ్రాట్ ఫోన్లను ఈ సేల్ ద్వారా అందించనున్నాట్లు తెలిపింది.ఇక ఈ సేల్ నుండి ఎటువంటి స్మార్ట్ ఫోన్లను ఎంత డిస్కౌంట్ తో అందించనున్నాదో తెలుసుకోవడానికి, ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకూ వేచి చూడాల్సిందే.                                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo