ఈ దసరా పండుగ కోసం అమెజాన్ ప్రకటించిన హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ నుండి Samsung Galaxy M13 5G పైన బిగ్ డీల్ ను అమెజాన్ ప్రకటించింది. 2022 జూలై లో శామ్సంగ్ తన గెలాక్సీ బడ్జెట్ సిరీస్ M Series నుండి తీసుకొచ్చిన గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ ఫోన్ పెయిన్ అందించిన ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్లను క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
శామ్సంగ్ గెలాక్సీ M13 సిరీస్: ధర మరియు ఆఫర్లు
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ను రూ.13,999 ధరతో లాంచ్ చెయ్యగా, ఈ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 రూపాయలకే అందిస్తోంది. మీరు ఈ ఫోన్ ను Citi క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే, 1250 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.