GFF Sale: 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందుకోండి అంటున్న అమెజాన్.!
Amazon Great Freedom Festival సేల్ నుండి 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగష్టు 5వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది
చాలా లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి
అమేజాన్ అప్ కమింగ్ సేల్ Great Freedom Festival సేల్ నుండి 5G స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ అందుకోండి అంటోంది అమేజాన్ ఇండియా. ఆగష్టు 5 నుండి ఆగష్టు 9 వరకూ జరగనున్న ఈ అమేజాన్ అతిపెద్ద సేల్ నుండి లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ లతో పొందే వీలుందని అమేజాన్ టీజర్ ద్వారా తెలిపింది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన చాలా 5G స్మార్ట్ ఫోన్ల ఆపిన అఫర్ ధరలతో కూడిన టీజింగ్ ను అమేజాన్ ప్లాట్ ఫామ్ నుండి పంచుకుంది.
Surveyఅమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగష్టు 5వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. అయితే, అమేజాన్ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రం ఆగష్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండే యాక్సెస్ లభిస్తుంది. అంటే, 12 గంటల ముందుగానే Prime Members ఈ సేల్ మొదలవుతుంది. ఈ సేల్ నుండి లభించనున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ పైన ఎలా వుండబోతున్నాయో చూద్దాం.
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి అందించిన 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ టీజింగ్ పేజ్ ద్వారా Realme లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్, Narzo 60 5G, శామ్సంగ్ లేటెస్ట్ 6G స్మార్ట్ ఫోన్ Galaxy M34 5G, iQOO Neo7 Pro, OnePlus Nord 3 5G మరియు iPhone 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్ ఇవ్వనున్నట్లు టీజింగ్ చేస్తోంది. కేవలం ఈ 5G స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాదు మోటోరోలా లేటెస్ట్ ఫోన్స్ Razr 40 seris ఫోన్ల పైన కూడా గొప్ప డీల్స్ అందుకోవచ్చని అమేజాన్ ఊరిస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి. అమేజాన్ ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో అందించింది. అందుకే, ఈ అమేజాన్ సేల్ నుండి కొనుగోలు చేసే ప్రోడక్ట్స్ ను SBI కార్డ్స్ మరియు EMI అఫర్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 5G స్మార్ట్ ఫోన్ అప్ కమింగ్ ఆఫర్స్ చెక్ చెయ్యడానికి Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile