అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M32 పైన రూ.3,000 భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ మొబైల్ డీల్

శామ్సంగ్ గెలాక్సీ M32 పైన రూ.3,000 భారీ డిస్కౌంట్

బడ్జెట్ ధరలో లేటెస్ట్ శామ్సంగ్ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్

అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M32 పైన రూ.3,000 భారీ డిస్కౌంట్.!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M32 పైన రూ.3,000 భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ శామ్సంగ్  కొనాలనుకునే వారికి గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుండి మంచి అప్షన్. ఈ ఫోన్ Super AMOLED డిస్ప్లే, ఫాస్ట్ ప్రాసెసర్ తో పాటుగా హెవీ 6000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M32 : సేల్ అఫర్ ధర

గెలాక్సీ M32 5G బేసిక్ వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజ్ తో అమెజాన్ సేల్ నుండి రూ.11,999 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అలాగే, 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.13,999 ధరకే వస్తుంది. అంతేకాదు, SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Samsung Galaxy M32 : స్పెసిఫికేషన్స్

ఈ శాంసంగ్ ఫోన్ 6.4 అంగుళాల FHD+ ఇన్ఫినిటీ U డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ Helio G80 SoC తో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5 స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది.

ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 20ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. అయితే, ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను పవర్ బటన్‌తో క్లబ్ చేసి సైడ్‌లో ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo