అమేజాన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన ఫెస్టివల్ సేల్ నుండి మంచి డీల్స్ ప్రకటించింది

HIGHLIGHTS

SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో ప్రొడక్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

అమేజాన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన ఫెస్టివల్ సేల్ నుండి మంచి డీల్స్ ప్రకటించింది

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ రోజు మనం స్మార్ట్‌ ఫోన్ల పైన అందిస్తున్న ప్రత్యేక డీల్స్  గురించి చుడనున్నాము. అందులోనూ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టునేలా ఉండే స్మార్ట్ ఫోన్లు మరియు వాటి డీల్స్ ఇక్కడ చుడనున్నాము.  మీరు బడ్జెట్ విభాగంలో వచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ డీల్స్  చూడవచ్చు. ఈ సేల్ నుండి SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో ప్రొడక్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo U10

MRP : రూ .10,990

అఫర్ ధర: రూ .8,990

వివో కొత్తగా లాంచ్ చేసిన ఈ  Vivo U10 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం 8,990 రూపాయలకు లభిస్తుంది. ఈ ఫోన్ ఒక 6.35 అంగుళాల HD + డిస్ప్లే మరియు వెనుక 13MP+8MP+2MP ట్రిపుల్ కెమేరాతో వస్తుంది. ఈ ఫోనులో పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ పరికరం PDAF, ఆటో హెచ్‌డిఆర్ మరియు డ్యూయల్-టోన్ ఫ్లాష్‌తో వస్తుంది, అంతేకాకుండా సెల్ఫీ కెమెరా AI బ్యాక్‌గ్రౌండ్ బ్లర్రింగ్ మరియు AI బ్యూటిఫికేషన్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M 30s

MRP: రూ .15,500

అఫర్  ధర: రూ .13,999

శామ్‌సంగ్ గెలాక్సీ M 30s  ఇటీవలే ఒక పెద్ద 6000mAh బ్యాటరీతో మరియు వెనుక ఒక 48MP ప్రధాన కెమేరా గల ట్రిపుల్ కెమేరా సేతప్పుతో వచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ M 30s ఒక 6.4-అంగుళాల ఇన్ఫినిటీ-V సూపర్ AMOLED FHD + డిస్ప్లే తో వస్తుంది.  అధనంగా, స్మార్ట్ ఫోన్ ఒక 15W టైప్ – C చార్జరును బాక్స్ తో పటు తీసుకొస్తుంది.

OPPO K3

MRP : రూ .26,990

అఫర్ ధర: రూ .18,990

OPPO నుండి ,మంచి స్పెసిఫికేషన్లతో మార్కెట్లోకి విడుదల చేయబడింది ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సేల్ నుండి కేవలం 18,999 రూపాయలకు ధరకు లభిస్తుంది. ఈ OPPO K3 లో, మీరు FHD + AMOLED డిస్ప్లేని ఒక 6.5 అంగుళాల పరిమాణంతో  పొందుతారు. అలాగే, ఇది ఒక పాప్-అప్ సెల్ఫీతో అందించడింది . ఇక ఈ ఫోన్ వెనుక 16MP+2MP డ్యూయల్ కెమేరాతో వస్తుంది మరియు ముందు ఒక 16MP సెల్ఫీ కెమేరా ఉంటుంది. 

శామ్‌సంగ్ గెలాక్సీ M 30

MRP : రూ .13,999

అఫర్ ధర: రూ .9,999

ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ M  30 గురించి మాట్లాడితే, ఈ పరికరం రూ .9,999 కు లభిస్తుంది. ఈ పరికరం 3GB RAM మరియు 32GB స్టోరేజితో వస్తుంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 ఇన్ఫినిటీ-యు నాచ్‌తో ఒక 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో ఎక్సినోస్ 7904 ఆక్టా-కోర్ SoC ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

Poco F1

MRP : రూ .30,999

అఫర్ ధర: రూ .18,999

ఈ Poco F1 స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన స్నాప్ డ్రాగన్ 845 ప్రోసెసరుతో చల్ తక్కువ ధరలో లాంచ్ బడినదిగా పేరు పొందింది. అయితే, ఈ ఫెస్టివల్ సేల్ ద్వారా ఇది మరింత తక్కువ ధరతో అమ్ముడవుతుంది. ఈ పోకో F1  స్మార్ట్‌ ఫోన్ ఒక 6.18-అంగుళాల FHD+ డిస్ప్లేతో మరియు సాధారణ నోచ్ డిస్జనుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 2.8GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ మరియు 4000mAh బ్యాటరీతో వస్తుంది.

Honor 20i

MRP: రూ .16,999

అఫర్ ధర: రూ .11,990

ఈ హానర్ 20i  స్మార్ట్ ఫోను వెనుక ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 24MP  ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 MP  పాప్-అప్ కెమెరా ఇవ్వబడింది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇది ఆండ్రాయిడ్ 10 రెడీ ఫోన్ ముందుగా రూ .16,999 ధరతో వుండే ఈ ఫోన్ను రూ .11,990 ధరతో ఈ సేల్ నుండి  కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A30s

MRP: రూ .18,990

అఫర్ ధర: రూ .16,999

ఇటీవల విడుదలైన ఈ శామ్సంగ్ గెలాక్సీ A30s  స్మార్ట్ ఫోను వెనుక ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 25MP  ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ మరియు 5 ఎంపి డెప్త్ సెన్సింగ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 MP  పాప్-అప్ కెమెరా ఇవ్వబడింది. ఇది ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది FHD రిజ;రిజల్యూషన్ అందిస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo