20 వేలకే OnePlus Nord CE 3 5G అందుకునే అద్భుతమైన అవకాశం.!

HIGHLIGHTS

OnePlus Nord CE 3 5G ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది

ఈ ఫోన్ ను 20 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం వచ్చింది

వన్ ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది

20 వేలకే OnePlus Nord CE 3 5G అందుకునే అద్భుతమైన అవకాశం.!

వన్ ప్లస్ లేటెస్ట్ పవర్ ఫుల్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ పైన అందించిన ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ చాలా చవక ధరకే లభిస్తోంది. Sony IMX890 OIS కెమేరా మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన AMOLED డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ను 20 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE 3 5G: Offers

వన్ ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్ ఫోన్ (8GB RAM, 128GB) బేసిక్ వేరియంట్ రూ. 24,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ పైన రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ ని అమేజాన్ జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల వరకూ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది.

amazon best deal on OnePlus Nord CE 3 5G
amazon best deal on OnePlus Nord CE 3 5G

Citibank Credit Card EMI ఆప్షన్ తో ఈ ఫోన్ ను కోన్ వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ధరకే అందుకునే అవకాశం వుంది.

Also Read: Air Coolers Deals: ధమాకా ఆఫర్లతో అమ్ముడవుతున్న కొత్త కూలర్స్.!

OnePlus Nord CE 3 5G: ప్రత్యేకతలు

వన్ ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ మరియు కెమేరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz రిఫ్రెష్ రేట్ బిగ్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ మరియు FHD+ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ ఫోన్ వెనుక 50MP Sony IMX890 OIS మెయిన్ సెన్సార్ ట్రిపుల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ పరంగా Qualcomm Snapdragon 782G ప్రోసెసర్ తో మంచి పెర్ఫార్మన్స్ అందిస్తుంది. ముఖ్యంగా, 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది ఈ వన్ ప్లస్ ఫోన్.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo