5G Mobile: అమెజాన్ సేల్ నుండి Lava 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్..!
Lava 5G ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది
LAVA Agni 5G అమెజాన్ సేల్ నుండి అతితక్కువ ధరకే లభిస్తోంది
Lava 5G ఫోన్ పైన రూ.4,000 భారీ డిస్కౌంట్
ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ LAVA గత సంవత్సరం చివరిలో లాంచ్ చేసిన Lava 5G ఫోన్, అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఈ ఇండియన్ బ్రాండ్ 5G స్మార్ట్ ఫోన్ LAVA Agni 5G అమెజాన్ సేల్ నుండి అతితక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ పవర్ ఫుల్ 5G ప్రోసెసర్, 64MP క్వాడ్ కెమెరా సెటప్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద డిస్ప్లే వంటి మంచి ఫీచర్లతో ఉంటుంది. అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి తెలుసుకోండి.
SurveyLAVA Agni 5G: అఫర్
LAVA Agni 5G 8జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ తో రూ.19,999 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది. కానీ, అమెజాన్ సేల్ నుండి ఈ ఫోన్ 4,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను RBL క్రెడిట్ మరియు Citi బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
LAVA Agni 5G: స్పెసిఫికేషన్స్
ఈ లావా 5G ఫోన్ పెద్ద 6.78 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో అందించింది మరియు ఇది 2.5D కర్వ్డ్ స్క్రీన్ . ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది.
ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన స్టాక్ ఆండ్రాయిడ్ 11 పైన నడుస్తుంది మరియు ఎటువంటి బ్లాట్ వేర్ లేకుండా అప్డేట్స్ ను త్వరగా అందుకుంటుంది.
లావా అగ్ని 5G స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 5ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.
లావా అగ్ని 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile