రెడ్మి 64MP స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.

రెడ్మి 64MP స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.
HIGHLIGHTS

ప్రపంచంలో మొట్టమొదటి 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్ను విడుదల చేయడానికి, షావోమి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మే 2019 లో, శామ్‌సంగ్ 64 ఎంపి కెమెరా సెన్సార్‌ను ఆవిష్కరించినప్పటి నుండి ఒక 64 MP కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ల రాకగురించిన పుకార్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, కొత్తగా రెడ్మి తన 64 MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఒక టీజింగును వీబోలో పోస్ట్ చేసింది. ఇంతకుముందు, జూన్ 2019 లో కంపెనీ వీబో పైన టీజర్‌ను పోస్ట్ చేసినందున, ప్రపంచంలోని మొట్టమొదటి 64 MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసిన మొదటి బ్రాండ్ రియల్మీ అవుతుంది. అయితే, రెడ్మి, రియల్మి మరియు శామ్‌సంగ్‌లను ఓడించే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రపంచంలో మొట్టమొదటి 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్ను విడుదల చేయడానికి, షావోమి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీబోలో పోస్ట్ చేసిన రెడ్మి టీజర్ ద్వారా దాని నుండి రాబోయే 64 MP కెమెరా స్మార్ట్‌ ఫోన్ త్వరలో రానున్నట్లు పేర్కొన్నారు. ఈ టీజరులో, ఒక పిల్లి యొక్క చిత్రాన్ని మరియు దాని కంటి చుట్టూ స్ఫుటమైన వివరాలను చుపిస్తూ, చిత్రంలోని జూమ్‌లను పోస్ట్ చేసింది. అయితే, ఈ చిత్రంలో దానిగురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు, కానీ ఈ అధికారిక టీజర్ నుండి మనకు లభించింది. వాస్తవానికి, కొన్ని సంవత్సరాల క్రితం నుండే స్మార్ట్‌ఫోన్‌లు 64 MP చిత్రాలను ఉత్పత్తి చేయగలిగినప్పటికీ, అటువంటి సెన్సార్ వివరాలతో ఫోటోలను ఇవ్వడం ఇదే మొదటిసారి.

అదనంగా, XDA షావోమి యొక్క MIUI కెమెరా ఆప్ లో 64MP “అల్ట్రా పిక్సెల్” మోడ్ కోసం ఇవ్వనున్నసూచనను కూడా గుర్తించింది. "డెవలపర్ ఉదహరించిన ఊహ చిత్రాలపై వాటర్‌మార్క్ కోసం" 64MP డ్యూయల్ కెమెరా "అనే డిఫాల్ట్ టెక్స్ట్‌కు అనుగుణంగా ఉంటాయి" అని XDA తెలిపింది.

ఇటీవలే, శామ్‌సంగ్ ప్రారంభించిన 64 ఎంపి కెమెరా సెన్సార్ ఈ సంవత్సరం రెండవ అర్ధ భాగంలో కొన్ని పరికరాల్లో కనిపిస్తుంది. టైమ్‌లైన్‌ను బట్టి చూస్తే రెడ్మి  అదే సెన్సార్‌తో ఒక ఫోన్‌ అందించడానికి పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఈ సెన్సార్‌తో వచ్చిన తొలి ఫోన్‌గా భావిస్తున్నారు. అలాగే, శామ్‌సంగ్ తన 64 ఎంపి సెన్సార్ 100 డిబి రియల్ టైమ్ హెచ్‌డిఆర్‌కు మద్దతు ఇస్తుందని పేర్కొంది, ఇది ఇతర పరికరాల్లో కన్వెన్షన్ 60 డిబి హెచ్‌డిఆర్ కంటే 66% ఎక్కువతో ఉంటుంది.

GSMArena ప్రకారం, “అన్ని పిక్సెల్‌లను ఉపయోగించడానికి 64 MP టోగుల్ అయ్యే అవకాశం ఉంది, అయితే ఇది మంచి లైటింగ్‌లో మాత్రమే చక్కగా పనిచేస్తుందని సిఫార్సు చేయబడింది. ఎందుకంటే ఇది బిన్డ్ వెర్షన్ వంటి అదనపు వివరాలను అందించదు.” మనము మెరుగైన ఆటో ఫోకస్ మరియు 480 fps వద్ద ఫుల్ HD వీడియోలు తీసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo