Airtel New Update: జనరంజక బడ్జెట్ ప్లాన్ ని సైలెంట్ గా తొలగించిన ఎయిర్టెల్.!

HIGHLIGHTS

ఎయిర్‌టెల్ ఇప్పుడు యూజర్లకు షాకింగ్ న్యూస్ అందించింది

ఒక బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ని చెప్పా పెట్టకుండా సైలెంట్ గా తొలగించింది

ఇది చాలా తక్కువ ధరలో వచ్చే జనరంజక బడ్జెట్ ప్లాన్ గా చెప్పబడుతుంది

Airtel New Update: జనరంజక బడ్జెట్ ప్లాన్ ని సైలెంట్ గా తొలగించిన ఎయిర్టెల్.!

Airtel New Update: యూజర్లకు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్న ఎయిర్‌టెల్ ఇప్పుడు యూజర్లకు షాకింగ్ న్యూస్ అందించింది. రీసెంట్ గా ఎయిర్టెల్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఒక బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ని చెప్పా పెట్టకుండా సైలెంట్ గా తొలగించింది. ఇది చాలా తక్కువ ధరలో వచ్చే జనరంజక బడ్జెట్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఎయిర్‌టెల్ తొలగించి ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ఏమిటి మరియు ఈ ప్లాన్ ఆల్టర్నేటివ్‌ ప్లాన్స్ కూడా ఈరోజు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Airtel New Update: తొలగించిన ప్లాన్ ఏమిటి?

ఎయిర్టెల్ రీసెంట్ గా విడుదల చేసిన బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 189 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ఇప్పుడు నిలిపివేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను మినిమం ప్రైస్ లో అతి చవక ప్లాన్ గా రూ. 189 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 21 రోజులు చెల్లుబాటు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, 1GB డేటా మరియు 300 SMS వంటి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు పూర్తిగా నిలిపివేయబడింది.

ఈ ప్లాన్ కి ఆల్టర్నేటివ్‌ ప్లాన్స్ ఏమిటి?

రూ. 189 బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కి రెండు ఆల్టర్నేటివ్‌ ప్లాన్స్ విషయానికి వస్తే, ఎయిర్‌టెల్ యొక్క రూ. 199 మరియు రూ. 219 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ ను చూడవచ్చు. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు అందిస్తాయి మరియు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి.

Also Read: OnePlus 15 : టాప్ 5 ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

రూ. 199 మరియు రూ. 219 ప్లాన్స్ అందించే ప్రయోజనాలు

ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా 28 రోజులు చెల్లుబాటు అవుతాయి. అంతేకాదు, రూ. 199 మరియు రూ. 219 రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తాయి. వీటిలో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ 100SMS మరియు 2GB డేటా కూడా అందిస్తుంది. అయితే, రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ 3GB డేటా మరియు 300 SMS ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

Airtel New Update

పైన తెలిపిన ప్రయోజనాలు కాకుండా ఈ రెండు ప్లాన్స్ కూడా అదనపు ప్రయోజనాలు అందిస్తాయి. అవేమిటంటే, ఈ ప్లాన్స్ తో 30 రోజుల ఫ్రీ హలో ట్యూన్ మరియు రూ. 17,000 రూపాయల విలువైన 12 నెలల Perplexity Pro AI సబ్ ప్రీమియం యాక్సెస్ కూడా ఉచితంగా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo