Ai+ Nova 5G : కేవలం రూ. 7,499 కే సూపర్ 5G ఫోన్ అందించిన భారతీయ కంపెనీ.!
దేశీయ పరిజ్ఞానం మరియు గొప్ప డేటా ప్రైవసీ తో ఈరోజు కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది
మాధవ్ సేథ్ సొంత కంపెనీ అందించిన NxtQuantum OS తో ఈ ఫోన్ రన్ అవుతుంది
ఈ ఫోన్ పూర్తి డేటా ప్రైవసీ కలిగి ఉంటుంది
Ai+ Nova 5G : పూర్తి దేశీయ పరిజ్ఞానం మరియు గొప్ప డేటా ప్రైవసీ తో ఈరోజు కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. మాధవ్ సేథ్ సొంత కంపెనీ అందించిన NxtQuantum OS తో ఈ ఫోన్ రన్ అవుతుంది మరియు ఈ ఫోన్ పూర్తి డేటా ప్రైవసీ కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ డేటా పూర్తిగా ఇండియాలో స్టోర్ అవుతుంది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 5జి ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
SurveyAi+ Nova 5G : ప్రైస్
ఎఐ ప్లస్ నోవా 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది. ఈ బేసిక్ వేరియంట్ 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ తో వస్తుంది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) ను రూ. 9,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై Axis క్రెడిట్ కార్డ్ EMI తో రూ. 500 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ కేవలం రూ. 7,499 ప్రారంభ ధరకే లభిస్తుంది.
జూలై 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: OnePlus Nord CE5 : బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Ai+ Nova 5G : ఫీచర్స్
నోవా 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 510K+ AnTuTu స్కోర్ అందించే Unisoc T8200 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ ప్రాసెసర్ కి సపోర్ట్ గా 8జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను సపోర్ట్ గా అందించింది. ఈ ఫోన్ Dual 5G సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ nxtQ సాఫ్ట్ వేర్ తో Android 15 OS పై అందిస్తుంది. ఈ ఫోన్ లో మీరు సేవ్ చేసుకునే డేట్ పూర్తిగా ఇండియాలో స్టోర్ చేయబడుతుంది.

కెమెరా పరంగా, ఈ కొత్త ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా (CIF + EIS) జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ఆకట్టుకునే కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో కూడా వస్తుంది.