Ai plus launching three new phones from Nova Series on tomorrow
లేటెస్ట్ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ Ai+ రేపు ఇండియాలో Nova Series నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా పల్స్ సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన ఏఐ ప్లస్, ఇప్పుడు నోవా సిరీస్ నుంచి మూడు ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఈ మూడు ఫోన్లలో ఒక ఫ్లిప్ ఫోన్ కూడా ఉంది. రేపు ఏఐ ప్లస్ లాంచ్ చేయనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ పై ఒక లుక్కేద్దామా.
ఏఐ ప్లస్ నోవా సిరీస్ నుంచి నోవా 2 5జి, నోవా 2 అల్ట్రా 5జి మరియు నోవా ఫ్లిప్ 5జి మూడు ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఈ మూడు ఫోన్లు కూడా ఇండియాలో రేపు లాంచ్ అవుతాయి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ టైమ్ మాత్రం క్లియర్ గా మెన్షన్ చేయలేదు. ఈ మూడు ఫోన్లు కూడా ఫ్లిప్ ద్వారా తీజ్ చేయబడుతున్నాయి. ఈ మూడు ఫోన్లు ఫ్లిప్ కార్ట్ యూనిక్ గా లాంచ్ అవుతున్నాయి. కాబట్టి, ఈ మూడు ఫోన్లు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతాయి.
ఈ ఫోన్ 6.74 ఇంచ్ బిగ్ HD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు ఐదు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Unisoc T 8200 5జి చిప్ సెట్ తో నడుస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు IP 64 రేటింగ్ తో కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ NextQ OS తో పని చేస్తుంది.
నోవా 2 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త కలర్ ఫుల్ నోటిఫికేషన్ లైట్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ స్లీక్ గా ఉంటుంది మరియు వెనుక సర్కిల్ డిజైన్ లో కలర్ ఫుల్ నోటిఫికేషన్ లైట్స్ ఉంటాయి. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది.
ఇందులో 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది 6000mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ తో TWS బడ్స్ ను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఏఐ ప్లస్ ఈసారి ఇండియన్ మార్కెట్లో ఫ్లిప్ ఫోన్ కూడా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.2mm మందంతో మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ మధ్యకు మడతపెట్టే 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 10 బిట్ కలర్ డెప్త్ తో వస్తుంది.
ఈ ఫోన్ 4nm ప్రాసెస్ టెక్నాలజీ కలిగి 7 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7300X చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 4325 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి.
Also Read: Sony మరియు JBL లేటెస్ట్ Dolby సౌండ్ బార్స్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!