Acer ZX 5G: చవక ధరలో 5G ఫోన్ తో రీ-ఎంట్రీ ఇచ్చిన ఏసర్.!

HIGHLIGHTS

ఏసర్ ఈరోజు ఎట్టకేలకు కొత్త ఫోన్ లను విడుదల చేసింది

ఏసర్ ఈరోజు Acer ZX సిరీస్ ను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది

బడ్జెట్ యూజర్ కు 5జి ఫోన్ అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అందించినట్లు ఏసర్ తెలిపింది

Acer ZX 5G: చవక ధరలో 5G ఫోన్ తో రీ-ఎంట్రీ ఇచ్చిన ఏసర్.!

చాలా రోజులుగా కొత్త ఫోన్ గురించి లాంచ్ చేస్తున్న ఏసర్ ఈరోజు ఎట్టకేలకు కొత్త ఫోన్ లను విడుదల చేసింది. ఏసర్ ఈరోజు Acer ZX సిరీస్ ను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ సిరీస్ నుంచి Acer ZX 5G స్మార్ట్ ఫోన్ చవక ధరలో ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ తో అందించింది. ఏసర్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ZX ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Acer ZX 5G: ప్రైస్

ఏసర్ ఈ ఫోన్ ను 5 వేరియంట్స్ లో అందించింది. ఇందులో బేసిక్ వేరియంట్ (4GB + 64GB) ను రూ. x,x90 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ వేరియంట్స్ ను మాత్రం వెల్లడించింది. రెండవ (4GB +128GB) వేరియంట్, మూడవ (6GB +128GB) వేరియంట్, నాల్గవ (8GB + 128GB) వేరియంట్ మరియు (8GB + 256GB) వేరియంట్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది.

Acer ZX 5G

బడ్జెట్ యూజర్ కు 5జి ఫోన్ అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అందించినట్లు ఏసర్ తెలిపింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సాల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: Motorola Edge 60 Stylus: బడ్జెట్ స్టైలస్ ఫోన్ వచ్చేసింది..ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Acer ZX 5G: ఫీచర్స్

ఏసర్ ఈ కొత్త ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఏసర్ లేటెస్ట్ 5జి ఫోన్ 6.78 ఇంచ్ ఇన్ సెల్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

ఈ ఏసర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 64MP Sony IMX682 మెయిన్ కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మ్యాక్రో కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది.

ఏసర్ జెడ్X 5జి స్మార్ట్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 OS పై పని చేస్తుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ SIM సపోర్ట్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 33W PD ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఏసర్ స్మార్ట్ ఫోన్ IP 50 రేటింగ్ తో డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo