Acer నుండి 9 వేల స్టార్టింగ్ ప్రైస్ తో రెండు స్మార్ట్ ఫోనులు మరియు టాబ్లెట్ లాంచ్
Acer బ్రాండ్ నుండి రెండు స్మార్ట్ ఫోన్స్ మరియు ఒక టాబ్లెట్ రిలీజ్ అయ్యాయి IFA 2016 ఈవెంట్ లో. వీటి పేరులు లిక్విడ్ Z6 మరియు లిక్విడ్ Z6 ప్లస్. టాబ్లెట్ -పేరు Iconia Talk S.
Surveyఅసలు IFA ఏంటి?
వరల్డ్ లోని అన్ని దేశాల నుండి tech కంపెనీస్ అన్నీ కలిసి వాటి కొత్త ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తాయి ఈ ఈవెంట్ లో. కన్స్యూమర్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ కు ఇది ప్రతీ ఇయర్ జరిగే పెద్ద ఈవెంట్. జర్మనీ లోని బెర్లిన్ లో జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే.. ఒలింపిక్స్ ఈవెంట్ ద్వారా ఆటలు ఎలాగో ఇది టెక్నాలజీ కు జరిగే ఈవెంట్. కంపెనీలు అన్నీ ఈవెంట్ లో గ్లోబల్ గా స్మార్ట్ ఫోనులు మరియు ఇతర ప్రొడక్ట్స్ లాంచ్ చేసి, వాటిని రెండు మూడు నెలలు తరువాత ఇతర దేశాలలో అమ్మకాలు చేస్తాయి.
Acer Liquid Z6 స్పెక్స్ – 5 in 2.5D curved గ్లాస్ డిస్ప్లే, క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC, 1GB ర్యామ్, 8MP అండ్ 2MP కేమేరాస్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ తో నవంబర్ నుండి సుమారు 9వేల రూ లకు అందుబాటులోకి రానుంది.
Acer Liquid Z6 Plus స్పెక్స్ – 5.5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ మీడియా టెక్ SoC, 3GB ర్యామ్, 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్, 4080mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, మెటల్ బ్యాక్ కవర్ తో డిసెంబర్ నుండి 18,600 రూ లు సెల్ అవనుంది.
Acer Iconia Talk S స్పెక్స్ – 7 in వాయిస్ కాలింగ్ HD డిస్ప్లే టాబ్లెట్ ఇది. క్వాడ్ కోర్ ప్రొసెసర్, 13MP రేర్ కెమెరా తో ఆసుస్ యాప్స్ తో వస్తుంది. ప్రైస్ – 12,600 రూ. సెప్టెంబర్ లో వస్తుంది.
Writer, gamer, and hater of public transport. View Full Profile
