మిడ్ రేంజ్ ధరలో బెస్ట్ 5 ఓవరాల్ పెరఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్లు
ఈ ఫోన్లు విడుదలైన వెంటనే గొప్ప అమ్మకాలను మరియు కస్టమర్ నుండి మంచి రివ్యూలను అందుకున్నాయి.
ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సివచ్చినపుడు మనం దానిలో ఏది ప్రత్యేకమైన ఫీచర్ అని తెలుసుకుని కొంటాము. అయితే, ఒక ప్రత్యేకత మాత్రమే కాదు ఫోన్ అన్ని విభాగాలలో పనితన్నై కలిగి ఉండాలి. కాబట్టి, ఇప్పుడు అటువంటి ఓవరాల్ పెరఫార్మెన్స్ స్మార్ట్ ఫోనులో 5 బెస్ట్ ఫోన్లను పరిశీలిద్దాం.
నోకియా 7 ప్లస్
ఈ నోకియా 7 ప్లస్, ఈ సంవత్సరంలో HMD గ్లోబల్ బ్రాండ్ నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్. ఇది మన్నికైన, మరియు అవాంతరం లేని వినియోగదారు అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC మరియు నో-ఫ్రిల్స్ Android UI కారణంగా ఇది ప్రధానంగా ఉపయోగించడానికి ఒక గొప్పసాదనం. ఈ నోకియా 7 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పై నవీకరణను అందుకున్న మొట్టమొదటి పరికరాల్లో ఒకటి. దీని యొక్క ధర కొంచెం అధికంగా ఉంటుంది
షావోమి మి A2
షావోమి మి A2 కూడా దాదాపుగా నోకియా 7 ప్లస్ వంటి వివరాలను కలిగి ఉంది , కానీ ఇది తక్కువ ధరలో వస్తుంది. Mi A2 వెనుకభాగంలో ఒక అద్భుతమైన డ్యూయల్ కెమెరా కూడా కలిగిఉంది. అదనంగా, Android One ధృవీకరణ కలిగివుంది అంటే ఇది ఆండ్రాయిడ్ 9 పై సహా, సాధారణ అప్డేట్లకు హామీ ఇస్తుంది . ఇది కూడా ఒక స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 4GB RAM, 64GB స్టోరేజితో చాలా చక్కగా ఉంది.
హానర్ 8 X
హానర్ 8X పెద్ద డిస్ప్లే మరియు వాటి అంచులు దాదాపు అన్ని వైపులా విస్తరిస్తాయి మరియు పైన నోచ్ ఉంటుంది, ఇందులోని నోచ్ ఇతర ఫోన్లలోలాగా పెద్దగా ఉండదు. హానర్ 8X కేవలం ఒక పెద్ద స్క్రీన్ కలిగిన ఫోన్ మాత్రమేకాదు, ఇది సరికొత్త కిరిన్ 710 SoC శక్తితో అధికమైన పనితీరును చేస్తుంది. అలాగే, దీనిలో AI బాగా పనిచేస్తుంది కెమేరా విభాగంలో కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఈ ఫోన్.
రియల్మీ 2 ప్రో
రియల్మీ నుండి వచ్చిన ఈ రియల్మీ 2 ప్రో, స్మార్ట్ ఫోనులో కొత్తధనాన్నికోరుకుంటున్నయూత్ కోసం తీసుకొచ్చినట్లు రియల్మీ తెలిపినది. ఇందులో, డిమాండ్ లో ఉన్న అన్నిలక్షణాలను తెచ్చింది ఇందులో- కెమెరా లో పోర్ట్రైట్ మోడ్, డ్యూ డ్రాప్ డిస్ప్లే, మరియు ఈ ధరలో ఒక స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసరును తీసుకొచ్చింది. అధిక మొత్తంలో, ఈ రియల్మీ 2 ప్రో అమ్మకాలను సాగించినట్లు కూడా కంపెనీ తెలిపింది.
హువాయ్ P20 లైట్
హువావే ఈ మధ్యకాలంలో చాలానే మధ్య- స్థాయి ఫోన్లను విడుదలచేసింది, వాటిలో హువాయ్ పి 20 లైట్ దాని ఆసక్తికరమైన కలర్ వేరియంట్ మరియు వెనుకవైపు కెమెరాతో అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా హువావే యొక్క కిరిన్ 659 SoC తో ఒక మంచి పనితనాన్ని అందిస్తుంది.