13MP+2MP+Low Light కలిగిన మూడు కెమెరాల ఫోన్ కేవలం రూ.6,999 మాత్రమే

HIGHLIGHTS

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది.

ఇది ఇటీవల మీడియా టెక్ తాజాగా ప్రకటించిన 2.0GHz క్లాక్ స్పీడ్ చేయగల మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది.

13MP+2MP+Low Light కలిగిన మూడు కెమెరాల ఫోన్ కేవలం రూ.6,999 మాత్రమే

ఇండియాలో ఇన్ఫినిక్స్ సంస్థ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి "Smart 3 Plus" ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేలా అందించబడింది. ఎందుకంటే, అతితక్కువ ధరలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. అంతేకాదు, ఒక పెద్ద వాటర్ డ్రాప్ నోచ్ తోపాటుగా పెద్ద బ్యాటరీని కూడా ఇందులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ : ధర మరియు ఆఫర్లు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజి కలిగిన ఒకే వేరియంట్ లోవిడుదలైంది. ఈ 2GBRAM +32GB స్టోరేజ్ వేరియంట్ రూ.6,999 ధరతో విడుదల చేయబడింది. అలాగే, ఈ ఫోనుతో జియో వినియోగదారులకి 4,300 వరకు క్యాష్ బ్యాక్ అఫర్ కూడా అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్  ఏప్రిల్ 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి జరగనుంది.          

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ప్రత్యేకతలు

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది.  ఇది 269ppi పిక్సెళ్ళ సాంద్రతను కలిగి, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు ఒక 88 శాతం బాడీ-టూ-స్క్రీన్ రేషియాతో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోను యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఇటీవల మీడియా టెక్ తాజాగా ప్రకటించిన 2.0GHz క్లాక్ స్పీడ్ చేయగల మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో పాటుగా ఒక SD మెమొరీ కార్డ్ తో 256GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక ఇందులోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.8 అపర్చరు కలిగిన ఒక ప్రధాన 13MP కెమేరాతో పాటుగా ఒక 2MP డెప్త్ కెమేరా మరియు మరొక Low Light సెన్సార్ కలగలిపి అందించిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో ఒక 8MP AI కెమెరాతో వస్తుంది. అధనంగా, ఇది AI బొకే, AR స్టిక్కర్లు AI బ్యూటీ మోడ్ వంటి అనేక ప్రత్యేకమైన ఫిచర్లతో, ఈ కెమెరాలను అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్, ఒక పెద్ద 3,500mAh బ్యాటరీ మరియు డ్యూయల్ 4G సపోర్టుతో వస్తుంది. ఇది ఇన్ఫినిక్స్ యొక్క సరికొత్త OS అయినటువంటి, XOS 5.0 ఆధారితంగా Android 9 Pie పైన నడుస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 వెర్షన్ కి సపోర్ట్ చేస్తుంది మరియు ఒక 3.5 ఆడియో జాక్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo