CES 2021 నుండి NEC తన 8-ఇంచ్ గేమింగ్ ల్యాప్ టాప్ LAVIE Mini ని ప్రకటించింది

CES 2021 నుండి NEC తన 8-ఇంచ్ గేమింగ్ ల్యాప్ టాప్ LAVIE Mini ని ప్రకటించింది
HIGHLIGHTS

NEC తన LAVIE Mini ల్యాప్ టాప్ ని ప్రకటించింది

LAVIE Mini ల్యాప్ టాప్ చాలా చిన్న సైజు గేమింగ్ ల్యాప్ టాప్

LAVIE Mini టూ-ఇన్-వన్ కన్వర్టబుల్ ల్యాప్ టాప్

CES 2021 ఆన్లైన్ కార్యక్రమం నుండి NEC తన LAVIE Mini ల్యాప్ టాప్ ని ప్రకటించింది. ఈ LAVIE Mini ల్యాప్ టాప్ చాలా చిన్న సైజు గేమింగ్ ల్యాప్ టాప్ మరియు కాంపాక్ట్ గా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ కేవలం 8 అంగుళాల పరిమాణంలో ఉంటుంది మరియు Intel Iris Xe Graphics శక్తితో వస్తుంది.

LAVIE Mini గేమింగ్ ల్యాప్ టాప్ 8-ఇంచ్ WUXGA టచ్ స్క్రీన్ తో ఉంటుంది మరియు కేవలం 579 గ్రాముల బరువుతో మాత్రమే వుంటుంది. ఈ ల్యాప్ టాప్  ఇంటెల్ యొక్క Core i7 11th Gen CPU మరియు Intel Iris Xe Graphics తో వస్తుంది. ఈ LAVIE Mini గేమింగ్ ల్యాప్ టాప్ క్రిస్టల్ వైట్ కలర్ లో చిన్న బ్యాక్ లిట్ రౌండ్ కీలతో మంచి రూపాన్ని రూపాన్ని కలిగివుంటుంది. ఇది 360-డిగ్రీలు తిప్పగలిగేలా వుంది టూ-ఇన్-వన్ కన్వర్టబుల్ ల్యాప్ టాప్ సౌకర్యాన్ని ఇస్తుంది.

ఇక ఈ ల్యాప్ టాప్ లో 4K TV వంటి వాటికీ స్క్రీన్ షేరింగ్ కోసం డాక్ స్టేషన్ వంటి అప్షనల్ యాక్ససరీస్ లను కూడా కలిగివుంది. ఈ ల్యాప్ టాప్ చిన్న పరిమాణం కారణముగా ట్రాక్ ప్యాడ్ బదులుగా ఆప్టికల్ టచ్ సెన్సార్ తో వస్తుంది. అలాగే, వీడియో కాలింగ్ కోసం ఇందులో ఇన్ బిల్ట్ కెమెరాని కూడా అందించారు.

ఇందులో అందించిన గేమింగ్ డాక్ తో ఈ ల్యాప్ టాప్ Xbox వంటి బటన్లతో మంచి గేమింగ్ PC గా వుంటుంది. గేమింగ్ ను ఎక్కువగా ప్రేమించే వారికీ మంచి గేమింగ్ ల్యాప్ టాప్ గా మాత్రమే కాకుండా కాంపాక్ట్ ల్యాప్ టాప్ గా కూడా వుంటుంది.         

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo