Redmi Note 17 Pro సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ .. 10,000mAh బ్యాటరీ తో లాంచ్ అవుతోంది.!
Redmi Note 17 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్
ఈ అప్ కమింగ్ ఫోన్ ను ఏకంగా 10,000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది.
ఈ సిరీస్ నుంచి మరో రెండు వేరియంట్లను లాంచ్ చేయబోతోంది
Redmi Note 17 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్ కోసం నిన్నటి వరకు త్వరలో లాంచ్ పేరుతో మాత్రమే టీజింగ్ చేసిన షియోమీ, ఇప్పుడు ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ డేట్ ను మేము ముందుగానే ఊహించిన డేట్ లో లాంచ్ కాబోతుంది. ముఖ్యంగా, ఈ సిరీస్ ఫోన్ 10,000mAh బ్యాటరీ తో లాంచ్ అవుతోందని గొప్ప టీజింగ్ చేసింది.
SurveyRedmi Note 17 Pro సిరీస్ లాంచ్ డేట్
రెడ్ మీ నోట్ 17 ప్రో సిరీస్ ను సెప్టెంబర్ 15వ తేదీ ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెగ్యులర్ వేరియంట్ లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మరో రెండు వేరియంట్లను లాంచ్ చేయబోతోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ లాంచ్ డీటెయిల్స్ అందించింది.
Redmi Note 17 Pro సిరీస్: ఫీచర్స్
షియోమీ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో రెడ్ మీ 17 సిరీస్ నుంచి రెడ్ మీ 17 మరియు రెడ్ మీ నోట్ 17 రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు రెడ్ మీ నోట్ 17 సిరీస్ నుంచి రెడ్ ని నోట్ 17 ప్రో మరియు నోట్ 17 ప్రో మాక్స్ రెండు ఫోన్లు లాంచ్ చేయడానికి లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ఏకంగా 1000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తునట్లు షియోమీ ప్రకటించింది.

ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో రెడ్ మీ నోట్ 17 మరియు రెడ్ మీ నోట్ 17 మాక్స్ రెండు ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెబుతున్న 10,000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఏకంగా నాలుగు రోజుల బ్యాటరీ బ్యాకప్ అందించే కలిగి ఉంటుందని షియోమీ ఈ ఫోన్ గురించి టీజింగ్ చేసింది.
Also Read: స్ట్రీట్ మొత్తం షేక్ చేసే 11.2.4 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్ .. ప్రైస్ ఎంతంటే.!
అయితే, ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ లిస్ట్ లేదా ఈ అప్ కమింగ్ సిరీస్ ఫీచర్స్ కానీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ కి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి, ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసే ఫోన్ కీలక ఫీచర్స్ త్వరలో అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ అఫీషియల్ డీటెయిల్స్ రిలీజ్ అయ్యే వరకు కొంచెం వేచి చూడాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
