Jio Book ఫీచర్లు లీక్: Android 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తోందా..!

Jio Book ఫీచర్లు లీక్:  Android 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తోందా..!
HIGHLIGHTS

Jio Book ల్యాప్‌టాప్ లీకయ్యాయి

Jio Book కీలకమైన వివరాలను వెల్లడించింది

Jio Book 2GB ర్యామ్ తో వస్తుంది

దేశంలో బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ధరలో తీసుకువస్తుందని చెబుతున్న Jio Book ల్యాప్‌టాప్  యొక్క స్పెక్స్ ఇప్పుడు GeekBench లిస్టింగ్ ద్వారా లీకయ్యాయి. ఈ లీకైన స్పెక్స్ ద్వారా  Jio Book ర్యామ్ వేరియంట్, ప్రోసెసర్ మరియు ఆపరేటింగ్ సిస్టం వంటి కీలకమైన వివరాలను వెల్లడించింది. ఇండియన్ మార్కెట్ బడ్జెట్ వినియోగదారుల కోసం తీసుకువస్తున్నట్లు జియో చెబుతున్న ఈ Jio Book యొక్క కొత్త సంగతులను తెలుసుకుందాం పదండి.

లేటెస్ట్ లీక్స్ ప్రకారం, Jio Book ల్యాప్ టాప్ ARM-బేస్డ్ మీడియాటెక్ MT8788 చిప్ సెట్ కి జతగా 2GB ర్యామ్ తో  వస్తుంది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ Windows కి బదులుగా Android 11 ఆపరేటింగ్ సిస్టం ఉపయోగిస్తుందని తెలుస్తోంది.

అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో Jio Book ల్యాప్ టాప్ స్పెక్స్ పరంగా వచ్చిన లీక్స్ నుండి ఇది స్నాప్‌డ్రాగన్ X12 4G మోడెమ్‌తో జతగా స్నాప్‌డ్రాగన్ 665 SoC తో వస్తుందని సూచించాయి. ఇది మాత్రమే కాదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ ప్రకారం కూడా Jio Book మూడు వేరువేరు వేరియంట్స్ లో ప్రారంభించవచ్చని కూడా అర్ధమవుతోంది. ఇక్కడ ఆ మోడల్ నంబర్ లను  కూడా చూడవచు (NB112MM, NB1148QMW మరియు NB1118QMW.)

ఇక GeekBench ప్రకారం, MediaTek MT8788 చిప్ పవర్డ్ JioBook సింగిల్-కోర్‌లో 1178 స్కోర్‌ను మరియు మల్టీ-కోర్ పెర్ఫార్మెన్స్ లో  4246 పాయింట్లను కలిగి ఉంది. మరిన్ని లీక్స్ ద్వారా జియోబుక్ మినీ HDMI స్లాట్, 720p HD స్క్రీన్, Wi-Fi, బ్లూటూత్ వంటి ఫీచర్లను కూడా వెల్లడించాయి.             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo