DataWind నుండి ఫ్రీ ఇంటర్నెట్ బ్రోజింగ్ తో రెండు నెట్ బుక్స్ లాంచ్
By
Press Release |
Updated on 03-Feb-2016
DataWind బ్రాండ్ నుండి DroidSurfer పేరుతో రెండు నెట్ బుక్స్ రిలీజ్ అయ్యాయి ఇండియాలో. ఒకటి 10 in మరొకటి 7 in మోడల్.
Survey✅ Thank you for completing the survey!
10in DroidSurfer ప్రైస్ 7,999 రూ. 7 in Droid ధర 5,999 రూ. వీటి హై లైట్ ఏంటంటే రెండూ ఫ్రీ అన్ లిమిటెడ్ ఇంటర్నట్ బ్రౌజింగ్ తో వస్తున్నాయి.
రిలయన్స్ మరియు Telenor ప్రీ పెయిడ్ సిమ్ లపై ఇంటర్నెట్ ఫ్రీ బ్రౌజింగ్. అయితే వీడియో మరియు ఆడియో స్ట్రీమింగ్ మాత్రం ఈ ఫ్రీ package లో ఉండవు.
అలాగే డౌన్లోడ్స్ కూడా ఉండవు. ఇవి వాడాలనుకుంటే మార్కెట్ లో ఉండే ఇంటర్నెట్ ప్లాన్స్ ద్వారా వాడాలి. 10 in మోడల్ లో 8GB ఇంటర్నల్ స్టోరేజ్, 7 in లో 4GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి.
నెట్ బుక్స్ అంటే టాబ్లెట్స్ వలె ఉంటాయి. రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం తో వస్తాయి. WiFi, కీ బోర్డ్, మౌస్ సపోర్ట్ కూడా ఉంది.