హువావే మీడియా పాడ్ M5 లైట్ టాబ్లెట్ హర్మన్ కార్డన్ ట్యూన్డ్ క్వాడ్ – స్పీకర్ అమరికతో విడుదలయ్యింది

HIGHLIGHTS

ఈ హువావే మీడియా పాడ్ M5 లైట్ టాబ్లెట్ 1920x 1200 పిక్సెళ్ళు మరియు 16:10 కారక నిష్పత్తి గల ఒక 10.1 డిస్ప్లే లక్షణాన్ని కలిగివుంది.

హువావే మీడియా పాడ్ M5 లైట్ టాబ్లెట్ హర్మన్ కార్డన్ ట్యూన్డ్ క్వాడ్ – స్పీకర్ అమరికతో విడుదలయ్యింది

ఈ హువావే మీడియాప్యాడ్ M5 లైట్ అనే కొత్త టాబ్లెట్ను నిరాడంబరంగా ప్రారంభించింది. ఈ కొత్త టాబ్లెట్ ఒక అల్యూమినియం యునిబాడి నిర్మాణం మరియు ఒక క్వాడ్స్పీ(4) స్పీకర్ల సెటప్ కలిగివుంది. ఈ టాబ్లెట్ 1920 x 1200 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్తో ఒక 10.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీని ప్రదర్శన యొక్క కారక నిష్పత్తి 16:10 గా పొందింది. ఒక మధ్యస్థాయి కిరిన్ 659 SoC ఈ పరికరానికి శక్తినిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

హువావే మీడియాప్యాడ్ M5 లైట్ రెండు రకాల్లో అందుబాటులో ఉంది. ఒకటి 3GB RAM మరియు 32GB నిల్వ మరియు మరొకటి 4GB RAM మరియు 64GB నిల్వ తో ఉంటాయి. ఈ టాబ్లెట్ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది సంస్థ యొక్క M- పెన్ లైట్ స్టైలస్ కి మద్దతు ఇస్తుంది, అని హువావే పేర్కొంది. అయితే, టాబ్లెట్ తో స్టైలెస్ లభ్యత దాని ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మీడియాప్యాడ్ M5 లైట్ పాడ్ Android Oreo v8.0 ఆధారిత, EMUI 8.0 పై నడుస్తుంది.

ఈ కొత్త టాబ్లెట్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణంగా క్వాడ్-స్పీకర్ సెటప్గా చెప్పవచ్చు. ఇది హర్మన్ కార్డన్ చేత ట్యూన్ చేయబడిన స్పీకర్లను మరియు  హువావే యొక్క హిస్టెన్ 5.0 సౌండ్ సిస్టంను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ పరికరం షాంపైన్ గోల్డ్ మరియు స్పేస్ గ్రే కలర్ వైవిధ్యాలలో అందుబాటులో ఉంది. ఏదేమైనప్పటికీ, భారతదేశంలో ఈ పరికరం ఎప్పుడు విడుదల చేయనున్నారన్న విషయం లేదా ఇంకా తెలియరాలేదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile