న్యూఢిల్లీ, ఆగస్టు 7, 2026: భారతదేశపు ప్రముఖ బ్రాడ్ కాస్ట్ మరియు డిజిటల్ నెట్‌వర్క్ అయిన టైమ్స్ నెట్‌వర్క్, మొట్టమొదటి Digit India’s Top Appliance Awards 2026 (DITAA 2026) విజేతలను ప్రకటించింది. టైమ్స్ నెట్‌వర్క్ సమర్పణలో, Haier సహకారంతో జరుగుతున్న ఈ అవార్డులకు Oneup Trade సహ-సహకారం అందిస్తుండగా, LG వ్యూహాత్మక భాగస్వామిగా, Selsmart సుస్థిరత భాగస్వామిగా మరియు హైట్స్ అవుట్ డోర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి.
ఈ అవార్డులు భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న గృహోపకరణాలు, టెలివిజన్లు మరియు స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల్లో అత్యుత్తమతను గుర్తిస్తాయి. 25 సంవత్సరాలకు పైగా స్వతంత్ర రివ్యూలు, లోతైన పరీక్షలు మరియు నిష్పాక్షిక టెక్నాలజీ జర్నలిజంలో సంపాదించిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, భారతీయ కుటుంబాల్లో రోజురోజుకు మరింత కీలక పాత్ర పోషిస్తున్న గృహోపకరణాల విభాగానికి కూడా Digit తన ఉత్పత్తుల మూల్యాంకన నైపుణ్యాన్ని విస్తరించింది. అర్థవంతమైన పెర్ఫార్మెన్స్, వినూత్నత, వినియోగ సౌలభ్యం మరియు విశ్వసనీయమైన వినియోగ అనుభవాన్ని అందించే ఉత్పత్తులను గుర్తించేందుకు ఈ అవార్డులను రూపొందించారు.
Digit India’s Top Appliance Awards 2026 గృహోపకరణాల్లోని ఆచరణాత్మక మెరుగుదలలను గుర్తించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, నిష్పాక్షిక విశ్లేషణ, వాస్తవ వినియోగం మరియు కొలవగల ఫలితాల ఆధారంగా రూపొందించిన పరీక్షా-ఆధారిత మూల్యాంకన ప్రక్రియ ద్వారా విజేతలను ఎంపిక చేస్తాయి. షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ ని దాని విభాగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూల్యాంకన విధానంతో పరీక్షించారు. ప్రోడక్ట్ లను కేవలం వాటి సాంకేతిక స్పెసిఫికేషన్స్ ఆధారంగా మాత్రమే కాకుండా, వాస్తవ వినియోగ పరిస్థితుల్లో అవి ఎంత స్థిరంగా పెర్ఫార్మెన్స్ కనబరిచాయి మరియు ప్రకటించిన సామర్థ్యాలను ఎంతవరకు నిజంగా అందచేశాయనే అంశాల ఆధారంగానూ మూల్యాంకనం చేశారు.
ఈ అవార్డుల తొలి ఎడిషన్ లో రిఫ్రిజిరేటర్లు, వాక్యూమ్ క్లీనర్లు, రోబోటిక్ ఫ్లోర్ క్లీనర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, హోమ్ సెక్యూరిటీ ఉత్పత్తులు మరియు టెలివిజన్లు వంటి విస్తృత శ్రేణి విభాగాలను చేర్చారు. ఎడిటోరియల్ బృందం కనీసం 150 పారామీటర్ల ఆధారంగా 140 కు పైగా ఉత్పత్తులను పరీక్షించడానికి 2,000 గంటలకు పైగా సమయం వెచ్చించింది. ఉపవిభాగాలు వివిధ రకాల ఉత్పత్తి ఫార్మాట్స్ మరియు వినియోగ సందర్భాలు కవర్ చేస్తాయి. దీంతో పోటీపడే ఉత్పత్తులను ఒకే సాధారణ ప్రమాణం ఆధారంగా కాకుండా, వాటికి సంబంధించిన సంబంధిత ప్రత్యామ్నాయ ఉత్పత్తులతో పోల్చి మూల్యాంకనం చేయడం సాధ్యమైంది.
అర్హత పొందిన అన్ని ఉత్పత్తులు భారతదేశంలో అధికారికంగా అందుబాటులో ఉండాలి మరియు Digit పరీక్షా కేంద్రాల్లో ప్రత్యక్ష (హ్యాండ్స్-ఆన్) మూల్యాంకనానికి లోనవ్వడం తప్పనిసరి. ప్రతి విభాగంలో ఉత్పత్తుల మధ్య న్యాయమైన పోలికలు ఉండేలా, అలాగే వినియోగదారుల సాంకేతికతపై Digit అనుసరిస్తున్న ఎడిటోరియల్ ప్రమాణాలను కొనసాగించే విధంగా ఈ మూల్యాంకన ప్రక్రియను రూపొందించారు.
| Best Water Purifier | Atomberg Intellon |
| Best Water Purifier (Value for Money) | Livpure Lotier |
| Most Reliable Water Purifier | Native by Urban Company M2 Pro |
| Best Air Purifier | LG PuriCare (AS10GDBY0) |
| Best Air Purifier (Value for Money) | Qubo Smart R700 |
| Design Innovation – Air Purifier | Dyson HushJet SP01 |
| Best Dish Washer | LG DFB335HMB |
| Best Dishwasher (Value for Money) | Midea MDWPF1301 |
| Most Reliable Dishwasher | Bosch SMP6HMI00I |
| Best Convection/Grill Microwave | Samsung MC32B7382QC/TL |
| Best Convection/Grill Microwave (Value for Money) | LG 32L Charcoal (MJEN326UHWF) |
| Best Solo Microwave | LG MS3032BK 30L |
| Best Smart Lock | Godrej IoT9 |
| Best Smart Lock (Value for Money) | TP-Link Tapo DL100 |
| Best Video Doorbell | Hikvision DS-KIS603-P |
| Best Video Doorbell (Value for Money) | Qubo Smart Video Doorbell Pro 2K |
| Best Home Security Camera (Value for Money) | CP Plus Ezykam CP-Z45Q Wi-Fi Camera |
| Best French Door Refrigerator | LG GV-K25FFGFB |
| Best French Door Refrigerator (Value for Money) | Haier Lumière 4-Door |
| Best Side-by-Side Door Refrigerator | Samsung RS76CB81A312HL |
| Best Side-by-Side Door Refrigerator (Value for Money) | Toshiba GR-RS682WE-PMI(06) |
| Best Double Door Refrigerator | Bosch XXL KDN86AID0I |
| Best Double Door Refrigerator (Value for Money) | Samsung RT80H51C3BHL |
| Most Innovative Double Door Refrigerator | Liebherr [TVPbgB 4231] |
| Best Single Door Refrigerator | Samsung RR21H2H25BB |
| Best Single Door Refrigerator (Value for Money) | LG GTD2156ZHSL |
| Best 3-Star Split AC | Hisense AS-18TW4RXSKQ02 Inverter AC |
| Best Split AC (Value for Money) | Optimist SUHC48ZV |
| Best 5-Star Split AC | LG AS-Q20JWZE |
| Most Intelligent AC | Haier HSA20DSD-GAI5NB-I |
| Best Robotic Vacuum Cleaner | Dreame L50s Pro Ultra |
| Best Robotic Vacuum Cleaner (Value for Money) | Milagrow iMap G5 Eco |
| Best Upright Vacuum Cleaner | Nuuk Ren Pro |
| Best Upright Vacuum Cleaner (Value for Money) | Dreame Mova K10 Pro |
| Best Front Load Washing Machine | LG FX1412A9K |
| Best Front Load Washing Machine (Value for Money) | Bosch WGA254ISIN |
| Best Top Load Washing Machine | Samsung WA80F10B3BTL |
| Best Top Load Washing Machine (Value for Money) | Lloyd GLWT855N12CB |
| Best Semi-Automatic Washing Machine | Intex SA90BGHG |
| Best Stackable Washing Machine | LG WashTower (FWT1310BG) |
| Best OLED TV | LG OLED G6 |
| Best Mini LED TV | Haier M92 |
| Best Mini LED TV (Value for Money) | Lumio Vision 9 |
| Best QLED TV | Xiaomi Smart TV X Pro 75 |
| Best RGB TV | Sony Bravia 7 II |
| Best Budget TV | Cellecor CT-55UHD4K Pro 4K |
| Excellence in Sustainability | Selsmart |
| Excellence in Home Entertainment | BenQ |
| Excellence in Home Networking | TP-Link |
| Excellence in Television | Xiaomi |
| Promising Home Entertainment Brand | Lumio |
| Excellence in Energy Solutions | Livguard |
| Excellence in Commercial Refrigeration | Elanpro |
| Excellence in Commercial Ovens | Unox |
Top Appliance Awards ద్వారా వినియోగదారులు, రిటైలర్లు మరియు విస్తృత గృహోపకరణాల పరిశ్రమకు స్వతంత్ర ప్రమాణంగా నిలిచే ఒక విశ్వసనీయ సూచికను ఏర్పాటు చేయడాన్ని Digit లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం, సౌకర్యం, వినియోగ సౌలభ్యం, శక్తి వినియోగం మరియు రోజువారీ గృహ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఉత్పత్తులను పరీక్షల ఆధారిత క్షుణ్ణమైన మూల్యాంకనానికి లోను చేస్తుంది.
ఈ అవార్డులు, ఉత్పత్తులను కేవలం సాంకేతిక స్పెసిఫికేషన్లు లేదా మార్కెటింగ్ ప్రకటనల ఆధారంగా మాత్రమే కాకుండా, ధృవీకరించదగిన పెర్ఫార్మెన్స్ మరియు వాస్తవ వినియోగం ఆధారంగా మూల్యాంకనం చేయాలనే Digit యొక్క విస్తృత ఎడిటోరియల్ తత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ విధానం Digit నిర్వహిస్తున్న ఇతర అవార్డుల కార్యక్రమం నమూనాను అనుసరిస్తుంది. ఇందులో ఉత్పత్తులు తమ తమ విభాగాల్లో నేరుగా పోటీ పడతాయి మరియు నిర్మాణాత్మక పరీక్షలు, తులనాత్మక విశ్లేషణ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.