best tips to reduce refrigerator electric bills on monsoon in telugu
Monsoon: సమ్మర్ లో ఫ్రిడ్జ్ (రిఫ్రిజిరేటర్), కూలర్ మరియు ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్స్ తో కరెంట్ బిల్ తో రాజీ పడలేని విషయంగా ఉంటుంది. ఎందుకంటే, సమ్మర్ హీట్ నుంచి మనల్ని రక్షించే వాటిలో ఈ మూడు వస్తువులు కచ్చితంగా ఉంటాయి. అయితే, వానాకాలం ఈ మూడు వస్తువుల్లో కూలర్ తో పని ఉండదు కాబట్టి పక్కన పెడతారు. కొన్ని సమయాల్లో ఫ్యాన్ ను కూడా ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, రిఫ్రిజిరేటర్ మాత్రం నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అందుకే, వర్షాకాలంలో రిఫ్రిజిరేటర్ తో వచ్చే కరెంట్ బిల్లు తగ్గించే అవకాశం ఉంది. వర్షాకాలంలో రిఫ్రిజిరేటర్ కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి ఉత్తమ చిట్కాలు ఈరోజు మేము అందిస్తున్నాము.
సాదరంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే, చాలా మంది ఫ్రిడ్జ్ ను వేసవిలో పెట్టిన సెట్టింగ్స్ లోనే ఉపయోగిస్తుంటారు. అందుకే, అవసరానికి మించి విద్యుత్ వినియోగం మీ ఫ్రిడ్జ్ ద్వారా జరుగుతుంది. అయితే, కొన్ని చిన్న మార్పులు చేస్తే ఫ్రిజ్ పనితీరు మెరుగుపడటమే కాకుండా మీ నెలవారీ కరెంట్ బిల్లును కూడా తగ్గించుకోవచ్చు.
వర్షాకాలంలో బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు ఫ్రిడ్జ్ ను అతి చల్లని సెట్టింగ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ కంపార్ట్‌మెంట్ ను 3°C నుంచి 5°C మధ్య, ఫ్రీజర్ ను -18°C వద్ద ఉంచితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఉపయోగించేది డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ అయితే మీ డీప్ ఫ్రిడ్జ్ సైడ్ లో ఉండే సెట్టింగ్ నాబ్ ను మాన్సూన్ వద్ద సెట్ చేయండి.
లేటెస్ట్ ఫ్రిడ్జ్ లలో ఎకో మోడ్ లేదా పవర్ సేవింగ్ మోడ్ లను కామ్ కంపెనీలు అందిస్తున్నాయి. మీ ఫ్రిడ్జ్ లో ఈ మోడ్స్ ఉంటే వర్షాకాలంలో దాన్ని ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
మీరు ఫ్రిడ్జ్ తలుపు తెరిచిన ప్రతి సారి చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఫ్రిడ్జ్ తిరిగి చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువ సేపు పని చేసి అధిక విద్యుత్ వినియోగిస్తుంది. అందుకే, మీరు మీ ఫ్రిడ్జ్ తలుపు ఎంత ఎక్కువగా ఓపెన్ చేస్తే మీ కరెంట్ బిల్లు అంత ఎక్కువ వస్తుంది.
ఫ్రిడ్జ్ తలుపు రబ్బరు సీల్ (డోర్ గ్యాస్కెట్) సరిగా లేకపోతే చల్లని గాలి బయటకు లీక్ అవుతుంది. దీంతో కంప్రెసర్ నిరంతరం పనిచేస్తుంది. ఇది మీ కరెంట్ బిల్లు ను తారాస్థాయికి తీసుకెళుతుంది. కాబట్టి, డోర్ గ్యాస్కెట్ చెక్ చేసి, అవసరమైతే గ్యాస్కెట్ ను మార్పించండి.
Also Read : లేటెస్ట్ GOVO ప్రీమియం 5.2 dolby Audio సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
మాన్యువల్ డీ ఫ్రాస్ట్ ఫ్రిజ్‌లలో మంచు ఎక్కువగా పేరుకుపోతే కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుంది. కాబట్టి, క్రమం తప్పకుండా మీ ఫ్రిడ్జ్ లో ఉండే డీ ఫ్రాస్ట్ ను క్లీన్ చేయండి.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షాకాలంలో మీ ఫ్రిడ్జ్ పనితీరు మెరుగు పడటమే కాకుండా విద్యుత్ బిల్లు కూడా బాగా తగ్గుతుంది.