ఇంటిని థియేటర్ గా మార్చే స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేస్తున్న జీబ్రానిక్స్.!

ఇంటిని థియేటర్ గా మార్చే స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేస్తున్న జీబ్రానిక్స్.!
HIGHLIGHTS

జీబ్రానిక్స్ ఇప్పుడు మరొక ప్రొజెక్టర్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది

ఇంటిని థియేటర్ గా మార్చే స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

నచ్చిన చోట కంటెంట్ ను వీక్షించ గలిగేలా ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ అవకాశం అందిస్తుంది

ప్రముఖ ఆడియో బ్రాండ్ జీబ్రానిక్స్ ఇప్పుడు మరొక ప్రొజెక్టర్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఇంటిని థియేటర్ గా మార్చే స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న LED హవా ను దాటి మరింత పెద్ద స్క్రీన్ ను కోరుకునే వారికి  వారికి నచ్చిన చోట కంటెంట్ ను వీక్షించ గలిగేలా ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ అవకాశం అందిస్తుంది. ఈ జీబ్రానిక్స్ Pixaplay 22 స్మార్ట్ ప్రొజెక్టర్  ను అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఇది జూన్ 3న లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ప్రొజెక్టర్ సంగతులు ఏమిటో తెలుసుకుందామా. 

జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్:

అమెజాన్ ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ కోసం అందించిన టీజింగ్ పేజ్ ప్రకారం, ఈ అప్ కమింగ్ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ 30,000 గంటల జీవితకాలం కలిగిన LED, APP సపోర్ట్ మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు జీబ్రానిక్స్ టీజింగ్ చెబుతోంది. ఇది చూడటానికి సరౌండ్ స్పీకర్ మాదిరిగా కనిపిస్తోంది మరియు దీన్ని క్యారీ చేసే బ్యాగ్ ను కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నట్లు చూపించింది. 

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 2.4Ghz & 5Ghz (డ్యూయల్ బ్యాండ్) కనెక్టివిటీ తో పాటుగా క్యాస్టింగ్ మరియు మిర్రరింగ్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఈ జీబ్రానిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ప్రొజెక్టర్ USB మరియు HDMI పోర్ట్స్ ను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఇన్ బిల్ట్ స్పీకర్ తో వస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ అందించ యాగాల స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 406cm, అంటే 159 ఇంచ్ సైజు వరకూ స్క్రీన్  ను అందించ గలదు అని కూడా తెలిపింది మరియు ఇది 1080p FHD సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo