21 రోజుల లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్ వీడియోలు 480P డిఫాల్ట్ లో ప్రదర్శించబడతాయి

HIGHLIGHTS

కోవిడ్ -19 మహమ్మారికి ప్రపంచం సిద్ధంగా లేదని స్పష్టమైంది.

21 రోజుల లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్ వీడియోలు 480P డిఫాల్ట్ లో ప్రదర్శించబడతాయి

కరోనా వైరస్ కారణంగా ఇండియాలో ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమిత మవ్వడంతో  ఇంటర్నెట్ వినియోగం కూడా పెరిగింది. ఈ సమయంలో, ఉద్యోగస్తులు చాలా మంది ఇంటి నుండి తమ పని చేస్తుండగా, విద్యార్థులు మరియు ఇతరులు ఇళ్ళ నుండి నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్‌ లలో వీడియోలు మరియు సినిమాలను చూడడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. బ్యాండ్‌ విడ్త్‌ ను ఓవర్‌లోడ్ చేయకుండా యూరప్‌లో 30 రోజుల స్టాండర్డ్ డెఫినేషన్ సెట్ చేయనున్నట్లు యూట్యూబ్  ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారికి ప్రపంచం సిద్ధంగా లేదని స్పష్టమైంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

భారతదేశంలో యూట్యూబ్ డిఫాల్ట్ వీడియోలు 480 P లో ప్లే అవుతాయి. మీరు సెట్టింగులకు వెళ్లడం ద్వారా రిజల్యూషన్ను మాన్యువల్‌ గా మార్చవచ్చు కాని డిఫాల్ట్ సెట్టింగ్ 480p అవుతుంది. గూగుల్ యొక్క స్పోక్ పర్సన్ ఒక ప్రకటనలో, "మేము ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ మరియు నెట్‌వర్క్ ఆపరేటర్లతో కలిసి పని చేస్తున్నాము మరియు ఈ వ్యవస్థ పైన ఎక్కువ ఒత్తిడి చేయకుండా ఒత్తిడిని తగ్గిస్తాము." గత వారం మేము ఐరోపాలో స్టాండర్డ్ డెఫినేషన్ ప్రకటించాము మరియు ఇప్పుడు మేము దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నాము.

కరోనావైరస్ కారణంగా అనేక లాంచ్ ఈవెంట్స్ రద్దు చేయబడ్డాయి మరియు అనేక ఇకామ్ ప్లాట్‌ ఫారమ్స్  కూడా మూసివేయబడ్డాయి. రియల్మి సీఈఓ మాధవ్‌ శేత్‌  వారి కొత్త స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలను రియల్మి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు, అయితే ఇప్పుడు ట్వీట్‌ ద్వారా నార్జో సిరీస్‌ తో సహా రాబోయే అన్ని ఇతర లాంచ్‌ లను నిలిపివేస్తున్నట్లు తెలిసింది.

అమెజాన్ నుండి కొన్ని సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, ఫ్లిప్ కార్ట్ తన ఇ-కామర్స్ సేవను కూడా నిలిపివేసిందని తెలుస్తుంది. దేశం మొత్తం ఈ సమస్యతో పోరాడుతున్న చోట, కంపెనీల తరపున ఇటువంటి నిర్ణయాలు అర్హమైనవి. కంపెనీల 2020 ప్రణాళికలు పూర్తిగా పట్టాలు తప్పాయి. ఎందుకంటే ఈ విపత్తు చాలా పెద్దది, మరియు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo