పాన్-ఆధార్ ఇంకా లింక్ చెయ్యలేదా!! అయితే, ఈ న్యూస్ మీకోసమే..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 Apr 2021
HIGHLIGHTS
  • మీ పాన్-ఆధార్ లింక్ చెయ్యలేదా

  • 1,000 రూపాయల ఫైన్

  • లీగల్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది

పాన్-ఆధార్ ఇంకా లింక్ చెయ్యలేదా!! అయితే, ఈ న్యూస్ మీకోసమే..!
పాన్-ఆధార్ ఇంకా లింక్ చెయ్యలేదా!! అయితే, ఈ న్యూస్ మీకోసమే..!

PAN కార్డు కలిగివున్న ప్రతిఒక్కరూ తమ ఆధార్ కార్డుతో దాన్ని లింక్ చేయాలి. దీనికి చిఎవరి గడువుగా మార్చి 31 వ తేదీ వరకు విధించిన గడువును పొడిగిస్తూ 2021 జూన్ 30 వ తేదీ ని చివరి గడువుగా ప్రకటించింది. అయితే, ఈ గడువు ముగిసేలోపుగా మీ పాన్-ఆధార్ లింక్ చేయకపోయినట్లయితే 1,000 రూపాయల ఫైన్ కట్టడడంతో పాటుగా లీగల్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనాన్స్ బిల్, 2021 లో దీని కోసం సవరణ చేసింది. అందుకే, మీ పాన్-ఆధార్ లింక్ త్వరగా చేయడం మంచిది.       

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది. దీని కోసం మీ UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.

ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A

ఇందుకు, ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలో ఈ విభాగం క్రొత్త  https://incometaxindiaefiling.gov.in లింకును అందిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా  వాటిని  చేయవచ్చు. మీ ఆధార్ మరియు పాన్ కార్డులో తప్పులు ఉన్నట్లయితే, మీ పేరు, చిరునామా మరియు DOB వంటి ఇతర సమాచారంలోని తప్పులను పరిష్కరించడానికి మీరు ఆధార్ మరియు పాన్ కార్డ్ కేంద్రాలకు వెళ్లాలి.

మీరు ఫారం 60 ను పూర్తి చేయకపోతే, ఇకనుండి ఆస్తిని కొనుగోలు చేయలేరు లేదా విక్రయించలేరు. కార్లు కొనడం, బ్యాంకు లేదా డిమాట్ ఖాతా తెరవడం, లేదా   మ్యూచువల్ ఫండ్స్ కొనడం, ఇంకా 50,000 సెక్యూరిటీల కొనుగోలు 50,000 జీవిత బీమా చెల్లింపులు వంటివి కూడా చేయలేరు. కాబట్టి ఇది నేడు లింక్ ను మరియు సమాచారాన్ని,  మీ స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి 

logo
Raja Pullagura

email

Web Title: your pan aadhaar link not done then know about this fine
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status