ఈ రోజు మ్యాచ్ లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరో చెప్పండి.. రియల్మీ 3 ప్రో గెలుచుకోండి..
రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ఫేస్ బుక్ పేజీలో మీ సమాధానాన్ని కమెంట్ ద్వారా తెలియచేయాలి
రియల్మీ సంస్థ, ఇప్పుడు సరికొత్తగా ఇండియన్ క్రికెట్ అభిమానులకోసం ఒక కాంటెస్ట్ ను ప్రకటించింది. దీని గురించిన వివరాలతో తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ ను అందించింది. ఈ పోస్ట్ ప్రకారం, ఈ రోజు ICC వరల్డ్ కప్ లో ఈ రోజు జరగనున్న ఇండియా మ్యాచ్ లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఎవరో ముందుగా ఊహించి చెప్పినవారికి Realme 3 Pro స్మార్ట్ ఫోన్ను బహుమతిగా అందించనుంది.
Surveyఈ మాట నిజంగా క్రికెట్ అభిమానులను కేరింతలు పెట్టిస్తుంది. అయితే, దీని సంభందించి కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఈ క్రింద రియల్ మీ కాంటెస్ట్ లో ఎలా పాల్గొనాలో తెలియపరిచాను.
ఈ కాంటెస్ట్ లో పాల్గొనడానికి ఈ క్రింది విషయాలు పాటించాలి.
1. మీరు కచ్చితంగా రియల్మీ యొక్క Facebook/Twitter Handle/ Instagram Account ని ఫాలో చేయాలి
2. రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ఫేస్ బుక్ పేజీలో మీ సమాధానాన్ని కమెంట్ ద్వారా తెలియచేయాలి
3. రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ట్విట్టర్ పేజీలో మీ సమాధానాన్నిReply ద్వారా తెలియచేయాలి
4. రియల్ క్రికెట్ ఫ్యాన్ ప్రశ్నకు మీరు రియల్మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజీలో మీ సమాధానాన్నిDM ద్వారా తెలియచేయాలి
5. మీరు తెలియ చేసే సమాధాన్ని సరైన #TheRealCricketFan హ్యాష్ ని ఉపయోగించాలి
6. కంపెనీ యొక్క అన్ని ప్లాట్ఫారమ్ల నుండి వచ్చిన వాటిలో వేకువ సరైన సమాధానాలు చెప్పిన ఒక్కరిని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు.