వాట్స్ఆప్ ట్రిక్: Data ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యొచ్చు

వాట్స్ఆప్ ట్రిక్: Data ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యొచ్చు
HIGHLIGHTS

Whatsapp నోటిఫికేషన్ల నుండి ఈ ట్రిక్ తో తప్పించుకోవచ్చు.

ట్రిక్ మాత్రం నిజంగా సూపర్

వాట్స్ఆప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

వాట్స్ఆప్ ఉపయోగం కోసం చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఈ ట్రిక్స్ వారి వారి అవసరాలను బట్టి ఉపయోగపడతాయి. ఈరోజు మన చూడబోయే ట్రిక్ మాత్రం నిజంగా సూపర్ ట్రిక్. ఎందుకంటే, ఈ ట్రిక్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని ఆఫ్ చేయవచ్చు. మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్ప్పుడు ఎక్కువగా వచ్చే Whatsapp నోటిఫికేషన్ల నుండి ఈ ట్రిక్ తో తప్పించుకోవచ్చు.       

నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి Pause It App డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని నమ్మిన తరువాత మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు. డేటా ఖర్చు చేయకుండా వాట్స్ఆప్ ఉపయోగించాలి అంటే కూడా ఒక ట్రిక్ వుంది. 

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

  • మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.
  • ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.
  • ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.
  • అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.
  • దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.
  • ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఎంపికను తీసివేయండి.

అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo