ఇక మీ ఫోన్ నుండే మెట్రో e-tikets బుక్ చేసుకోవచ్చు : హైదరాబాద్ మెట్రోకీ కొత్త విధానం
హైదరాబాద్ మెట్రో మరొక మైలురాయిని దాటింది. దేశంలో ఎక్కడ లేని విధంగా, మెట్రో రైలులో క్యూలో నిలబడి టికెట్ తీసుకోవడానికి వేచివుండాల్సిన అవసరం లేకుండా చేసేలా కొత్త e-Ticket విధానాన్ని అందుబాటులోకి తీసుకోచ్చింది. L&T Metro Rail మరియు Make My Trip భాగస్వామ్యంతో ఈ కొత్త e-Ticket విధానాన్ని వాడుకలోకి తీసుకొచ్చింది.
Surveyవాస్తవానికి, ఇప్పటివరకు మెట్రో రైలులో ప్రయాణించే వారు టికెట్ ను తీసుకోవడానికి చాల సమయం క్యూ లో నిలబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ. ఇక నుండి అటువంటి అవసరం లేకుండానే, QR Code ఆధారిత e-ticket తో హైద్రాబాద్ మెట్రో లో ప్రయాణించవచ్చు. ఇక ఇందులో అత్యంత సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, ఒకసారి ఒక ప్రయాణికుడు గరిష్టంగా 6 టికెట్లను MMT ఆన్లైన్ ప్లేట్ ఫారం నుండి కొనవచ్చు.
ఈ టెక్-ఆధారిత టికెట్ బుకింగ్ ఫీచర్, ప్రయాణికులను అనేకరకాలైన టికెట్స్ ను ప్రీ బుకింగ్ చేసుకునేలా అనుమతిస్తుంది. ఇందులో, సింగల్ మరియు రిటర్న్ జర్నీ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, బుక్ చేసిన టికెట్లను Whatsapp ద్వారా తోటి ప్రయాణికులకు షేర్ కూడా చెయ్యవచ్చు.