షావోమి నుండి ట్రిమ్మింగ్ మిషన్ లాంచ్ : రేపు మధ్యాహ్నం 12 గంటలకి

HIGHLIGHTS

Mi.com పైన ఈ ట్రిమ్మింగ్ మిషన్ గురించి టీజింగును అందించింది.

రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ట్రిమ్మింగ్ ప్రొడక్టును లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

1 పాయింట్ మొదలుకొని 10 పాయింట్ల వరకు సరిచేసుకునేలా కనిపిస్తుంది.

షావోమి నుండి ట్రిమ్మింగ్ మిషన్ లాంచ్ : రేపు మధ్యాహ్నం 12 గంటలకి

షావోమి అనేక ఉత్పత్తుల పైన తన పంజా విసురుతోంది. ముందుగా, స్మార్ట్ ఫోన్ల నుండి మొదలై పెట్టి ఒక్కొక్కటిగా తన ప్రొడక్టులను తీసుకొస్తోంది. మార్కెటింగ్ చేయడంలో దిట్టైన షావోమి, వినియోగదారులు ఎటువంటి వివరాలను కోరుకుంటారో అటువంటి ప్రత్యేకతలతో తన ప్రొడక్టులను తీసుకొస్తుంది కాబట్టి, వాటిని వినియోగదారులు ఎక్కువగా ఆధరించారని చెప్పొచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు షావోమి యొక్క సొంత వెబ్ సైట్ అయినటువంటి, Mi.com పైన ఈ ట్రిమ్మింగ్ మిషన్ గురించి టీజింగును అందించింది. ఈ టీజింగ్ ప్రకారంగా, రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ట్రిమ్మింగ్ ప్రొడక్టును లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టీజింగ్ ద్వారా, ఈ ప్రోడక్ట్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది  అర్ధమవుతుంది. కాని, దీనికి సంభందించిన పూర్తి వివరాలను మాత్రం వివరంచలేదు.

అయితే, మనకు నచ్చినట్లుగా ట్రిమ్ చేసుకోవడానికి సరిపడే విధంగా దీనిలో ప్రత్యకతలను ఆంధిచినట్లు తెలుస్తోంది, దీని గురించి క్యాప్షన్ గా " Engineered For  Perfection " అని అందించింది. అంటే, పరిపూర్ణత కోసం దీన్ని డిజన్ చేసినట్లుగా చెబుతోంది. అలాగే, ఈ టీజింగులో చూపించిన ఒక చిత్రంలో మనకు నచ్చిన పాయింట్స్ లో ట్రిమ్ చేసుకునేలా ఒక ఎంపిక బటన్ అంకదినట్లు కనబడుతోంది. ఇందులో, 1 పాయింట్ మొదలుకొని 10 పాయింట్ల వరకు సరిచేసుకునేలా కనిపిస్తుంది. ఇక పూర్తి వివరాల కోసం రేపటి వరకు వేచిచూడాల్సిందే.             

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo