షావోమి సంస్థ Mi Men’s Sports Shoes 2 తో ఇండియాలో ఫుట్ వేర్ విభాగంలో రంగ ప్రవేశం

HIGHLIGHTS

ఈరోజు Mi Men's Sports Shoes 2 ప్రకటించింది.

షావోమి సంస్థ Mi Men’s Sports Shoes 2 తో ఇండియాలో ఫుట్ వేర్ విభాగంలో రంగ ప్రవేశం

స్మార్ట్ ఫోన్ విభాగంలో, ఇండియాలో No.1 బ్రాండ్ గా గుర్తింపు పొందిన షావోమి, ఈ రోజు లైఫ్ స్టైల్ విభాగంలో ఒక కొత్త ప్రోడక్టుని ప్రకటించింది. ఈ ప్రోడక్ట్ ఏమిటనుకుంటున్నారా? అదే ఈ Mi Men's Sports Shoes 2, ఇది షావోమి యొక్క లైఫ్ స్టైల్ విభాగంలో స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్ యొక్క ప్రత్యక కలయిగా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి ఇండియా యొక్క కేటగిరీ & ఆన్లైన్ సేల్స్ విభాగానికి ప్రతినిధి అయినటువంటి, రఘు రెడ్డి దీని గురించి మాట్లాడుతూ, 2019 ప్రారంభం నుండే ఒక ఉత్సాహభరితమైన  సంవత్సరంగా మొదలైనది, ఎందుకంటే ఇప్పటికే రెండు గుర్తించదగిన కొత్త కేటగిరీలను పరిచయం చేశాము. ఇక ఇప్పుడు, లైఫ్ స్టైల్ విభాగంలో మరొక కొత్త ప్రోడక్ట్ అయినటువంటి,మి మెన్స్ స్పోర్ట్స్ షూ2 ని తమ Mi crowdfunding ప్లాట్ఫారంలో ప్రత్యక్షంగా తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉందని" తెలిపారు. అలాగే, ఈ మి మెన్స్ స్పోర్ట్స్ షూ2 మంచి సరసమైన ధరలో "బెస్ట్ డిజైన్ మరియు పెరఫార్మెన్స్" కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

Mi Men's Sports Shoes 2 ప్రత్యేకతలు

పురుషుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ Mi Men's Sports Shoes 2, ఒక 5-in-1 ప్రత్యేక- అచ్చు(Uni-Moulding) సాంకేతికతతో వస్తుంది. అంటే, ఈ బూట్లు 5 వివిధ రకాలైన పదార్ధాల కలయికగా వస్తుంది, తద్వారా షాక్ – శోషన్(Shock-Absorbent), అధిక మన్నిక, స్లిప్ రెసిస్టన్స్ వంటి వాటితో వస్తుంది. ఒక దీని Fish Bone (చేప వెన్నెముక) వంటి నిర్మాణం, మీకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మీకు చక్కని కంఫర్ట్ ఇస్తుంది.

ఈ Mi Men's Sports Shoes 2 లు లోపల గాలి తగిలేలా మరియు వాషింగ్ మెషీనులో కూడా ఉతుక్కునేలా వుండే ఒక మంచి మెస్ ఫ్యాబ్రిక్ తో వస్తాయి. ఇవి గరిష్టంమైన గ్రిప్ ఇస్తాయి మరియు అధిక రాపిడి నిరోధకతతో ఉంటాయి.  అలాగే, ఈ బూట్లు బ్లాక్ ,డార్క్ గ్రే మరియు బ్లూ వంటి 3 రంగులలో లభిస్తుంది.

Mi Men's Sports Shoes 2 ధర మరియు అందుబాటు

ఈ Mi Men's Sports Shoes 2 ఫిబ్రవరి 6వ తేదీ  2019 నుండి రూ. 2,499 ముందస్తు ధరతో అందుబాటులో ఉంటాయి. అయితే, షిప్పింగ్ మాత్రం 15 వ తేదీ మార్చి 2019 నుండి ప్రారంభమవుతుంది. Mi crowdfunding నుండి అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo