షియోమి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ తీసుకొస్తోందా?

షియోమి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ తీసుకొస్తోందా?
HIGHLIGHTS

200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్లలో గరిష్ఠమైన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఇప్పటికే చాలా వేగవంతమైన ఛార్జింగ్ తో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. కానీ షియోమి ప్లాన్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ లో ఇవ్వనున్న ఛార్జింగ్ గురించి వింటే మాత్రం ఆశ్చర్యచకితులు కావాల్సిందే. ఎందుకంటే, ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం షియోమి ఏకంగా 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ స్మార్ట్ ఫోన్ ను ఇదే సంవత్సరం లోనే లాంచ్ కూడా చెయవచ్చని సూచించింది.

GSMarena అందించిన ఒక రిపోర్ట్ ప్రకారం షియోమి 200W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి పనిచేస్తునట్లు తెలిపింది. అంతేకాదు, కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ల యొక్క అల్ట్రా మోడల్ వేరియంట్ లో ఇవ్వవచ్చని కూడా సూచించింది. ఇప్పటికే, లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో గరిష్ఠమైన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి అందుబాటులో వుంది.

నానాటికి అభివృద్ధి చెందుతున్న టెక్నలాజితో ఏదైనా సాధ్యం కావచ్చు. ప్రస్తుతం, కేవలం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేరుకుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొన్ని మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లయితే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వచ్చాయి. షియోమి యొక్క Mi 10 ఎక్స్ ట్రీమ్ కొమ్మమరేటివ్ ఎడిషన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్, 55W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వుంది. వీటన్నిటిని టోటల్ చేసి చూస్తే  185W కాబట్టి 200W ఛార్జింగ్ సపోర్ట్ ఫోన్ ను ప్రకటించడం షియోమి కి పెద్ద విషయం కాకపోవచ్చు.                      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo