ఇండియాలో సరికొత్త MI Air Purifier 2C లాంచ్ : ధర కేవలం రూ. 6,499
ఈ ఎయిర్ ప్యూరీ ఫయర్ ఒక గంటకు 350 క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేసే శక్తితో వస్తుందని వివరించారు.
షావోమి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ కార్యక్రమం మొదలవుతుండగానే, సంస్థ యొక్క ఇండియా హెడ్ మరియు గ్లోబల్ వైస్ ప్రసిడెంట్ అయినటువంటి, మనూ కుమార్ జైన్ ఈ కార్యక్రమం ద్వారా 5 కొత్త ప్రొడక్టులను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. వాటిలో ముందుగా ఎయిర్ పొల్యూషన్ నుండి మంచి గాలిని పొందడానికి వీలుగా ఒక కొత్త MI Air Purifier 2C ని విడుదల చేశారు.
Surveyఈ MI Air Purifier 2C ని చాలా మంచి ప్రత్యేకతలతో తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, చాలా ప్రత్యేకతలు కలిగివున్న ఈ ఎయిర్ ప్యూరీఫయర్ ను కేవలం రూ.6,499 ధరలో విడుదల చేశారు. ఏది ఇండియా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఇండియాలోనే తయారు చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
MI Air Purifier 2C ప్రత్యేకతలు
ఈ MI Air Purifier 2C డబుల్ ఫిల్టరేషన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది గాలిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది ట్రూ HEPA ఫిల్టర్ తో వస్తుంది కాబట్టి 99.97% గాలిని శుభ్రపరిచి ఎటువంటి హానిలేని స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని పేర్కొన్నారు. దీనితో పాటుగా, రియల్ టైం ఎయిర్ ఇండికేటర్ తో వస్తుంది కాబట్టి ఇది ఈ ఇంట్లోని గాలి యొక్క ప్రమాదస్థాయిని వెంటనే తెలియచేస్తుంది. ఈ ఎయిర్ ప్యూరీ ఫయర్ ఒక గంటకు 350 క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేసే శక్తితో వస్తుందని వివరించారు.