Xiaomi Hyper OS 4: షావోమీ, రెడ్‌మీ మరియు పోకో ఫోన్లకు ఆండ్రాయిడ్ 17 కొత్త అప్‌ డేట్.. పూర్తి మొబైల్ లిస్ట్ ఇదిగో.!

Highlights

Mi స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు షావోమీ గుడ్‌ న్యూస్ చెప్పింది

సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Hyper OS 4 స్టేబుల్ అప్‌ డేట్ రోల్‌ అవుట్ ప్రకటించింది

ఈ అప్‌ డేట్ Android 17 OS ఆధారంగా రూపొంచబడింది

Mi స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు షావోమీ గుడ్‌ న్యూస్ చెప్పింది. తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Hyper OS 4 స్టేబుల్ అప్‌ డేట్ రోల్‌ అవుట్ షెడ్యూల్‌ ను షావోమీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. Xiaomi, రెడ్‌మీ మరియు పోకో బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ ఫోన్లకు నవంబర్ 2026 నుంచి ఈ అప్‌ డేట్ అందించనున్నట్లు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ అప్‌ డేట్ Android 17 OS ఆధారంగా రూపొంచబడింది.

Xiaomi Hyper OS 4:

Mi స్మార్ట్ ఫోన్ ల కోసం షావోమీ మేజర్ అప్డేట్ ని ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ OS నడుస్తున్న షావోమీ, రెడ్‌మీ మరియు పోకో ఫోన్లకు ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ తో కొత్త అప్‌ డేట్ రిలీజ్ కోసం షెడ్యూల్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. ఈ కొత్త యూజర్ ఇంటర్‌ ఫేస్, మెరుగైన యానిమేషన్లు, AI ఫీచర్లు, పనితీరు మెరుగుదలలు వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. కంపెనీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అప్‌ డేట్లను మూడు దశల్లో విడుదల చేయనుంది. అయితే, అన్ని ఫోన్లకు ఒకేసారి కాకుండా దశలవారీగా ఈ కొత్త అప్ డేట్ ని అందించనుంది.

ఫస్ట్ ఫేజ్లో అప్‌ డేట్ పొందే ఫోన్లు

నవంబర్ ప్రారంభం నుంచి, అంటే మొదటి వారంలో ఈ క్రింద సూచించిన మీ ఫోన్లు కొత్త అప్ డేట్ ను అందుకుంటాయి.

  • షావోమీ 17 అల్ట్రా
  • షావోమీ 17
  • షావోమీ 17T ప్రో
  • షావోమీ 17T,
  • రెడ్‌మీ 15 Pro+ 5G
  • రెడ్‌మీ నోట్ 15 Pro 5G
  • రెడ్‌మీ నోట్ 15 Pro
  • రెడ్‌మీ నోట్ 15 5G
  • రెడ్‌మీ నోట్ 15
  • రెడ్‌మీ17 5G
  • రెడ్‌మీ17
  • రెడ్‌మీ 17C 5G
  • రెడ్‌మీ 15C 5G
  • రెడ్‌మీ15
  • పోకో F8 అల్ట్రా
  • పోకో F8 ప్రో
  • పోకో X8 ప్రో మాక్స్
  • పోకో X8 ప్రో
  • పోకో X8 ప్రో Iron Man Edition
  • పోకో M8 ప్రో
  • పోకో M8
  • పోకో C95 ప్రో
  • పోకో C85 ఫోన్లు

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile