200 MP భారీ కెమెరాతో స్మార్ట్ ఫోన్
Xiaomi అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్
200 MP భారీ కెమెరా సెన్సార్
200 MP భారీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఘనతను కలిగిన మొదటి ఫోన్ అందించడానికి Xiaomi తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం పనిచేస్తోంది. షియోమి తీసుకురావడానికి చూస్తున్న ఆ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రొసెసర్ మరియు ఇతర ఫీచర్లు కూడా భారీగానే ఉంటాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కొత్త రిపోర్ట్స్ నిజమైతే గనుక ఆ స్మార్ట్ ఫోన్ నిజంగానే భారీ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేలా కనిపిస్తోంది.
Surveyకొన్ని రిపోర్ట్స్ ప్రకారం, షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Mi 12 లో భారీ 200MP కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రొసెసర్ కలిగి ఉంటుందని కూడా నివేదికలు చెబుతోంది. ఈ ఫోన్ లో ఇవ్వనున్న 200 MP భారీ కెమెరా సెన్సార్ ను సామ్సంగ్ మరియు ఒలంపియస్ సిద్ధం తయారు చేస్తాయని కూడా తెలిపింది.
ఇక ఇండియాలో Xiaomi లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Mi 11 Lite. ఈ ఫోన్ యొక్క 6GB మరియు 128GB బేస్ వేరియంట్ రూ.21,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.23,999 ధరతో ప్రకటించబడింది.
ఇక మి 11 లైట్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.55-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10 ప్లేబ్యాక్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు Gorilla Glass 5 ప్రొటక్షన్ కూడా కలిగివుంది.
మి 11 లైట్ కేవలం 6.8 మిల్లీమీటర్ల మందం మరియు అతితక్కువ 157 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ మరియు టుస్కానీ కోరల్ వంటి మూడుచక్కని కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Xiaomi Mi 11 Lite స్మార్ట్ న్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 G శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM వరకు మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను పెంచుకునే ఎంపిక కూడా ఉంది. ఇది MIUI 12 పై పనిచేస్తుంది, ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఉంటుంది.
మి 11 లైట్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో, f / 1.79 ఎపర్చరు గల 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది పంచ్-హోల్ నాచ్ కటౌట్ లోపల ఉంది.
ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు 4,250 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి సపోర్ట్ తో అందించింది.