Xiaomi ఫోన్లు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. MIUI 14 అప్డేట్ వచ్చేసింది.!

HIGHLIGHTS

Xiaomi ఫోన్లు వాడుతున్న వారికి కంపెనీ గుడ్ న్యూస్

ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన MIUI 14 అప్డేట్ ను ప్రకటించింది

ఇది లేటెస్ట్ Xiaomi 13 Series తో పాటు వస్తుంది

Xiaomi ఫోన్లు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. MIUI 14 అప్డేట్ వచ్చేసింది.!

Xiaomi ఫోన్లు వాడుతున్న వారికి కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన MIUI 14 అప్డేట్ ను ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్ సర్కిల్స్ మరియు పిల్స్ అకృతులతో కూడిన రీడిజైన ఇంటర్ఫేజ్ ను యూజర్లు చూడవచ్చు. ఇది లేటెస్ట్ Xiaomi 13 Series తో పాటు వస్తుంది. అయితే, MIUI 14 ముందుగా వచ్చిన యూజర్ ఇంటర్ఫేజ్ ల మాదిరిగా హెవీగా ఉండకుండా సాపేక్షంగా లైట్ గా ఉంది.  Xiaomi యొక్క ప్రాజెక్ట్ రేజర్‌ తో ఈ లేటెస్ట్ OSని వీలైనంత లైట్ గా ఉంచాలని షియోమీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, ఈ కొత్త పరిణామాన్ని దిగ్విజయంగా తీసుకువచ్చింది. మరి ఈ షియోమీ యొక్క లేటెస్ట్ MIUI 14 ఎలావుంది మరియు ఏ ఫోన్లలో ముందుగా చేరుకోనున్నదో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షియోమి అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొన్నట్లుగా, "Xiaomi 13 Series లేటెస్ట్ MIUI 14 తో వస్తుంది. ఇది సౌలభ్యం మరియు సరళత చుట్టూ కేంద్రీకృతమై ఉంది, ఇది ప్రతిచోటా సింప్లిసిటీ మరియు రిఫైన్డ్ చేసిన వివరాలను చూపుతుంది మరియు దీర్ఘకాలం మృదువైన ఆపరేషన్స్ అందిస్తుంది." Xiaomi నుండి వచ్చిన లేటెస్ట్  ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్ స్టోరేజ్ ఆక్రమణను ఆప్టిమైజ్ చేస్తుంది మరియు తొలగించలేని సిస్టమ్ యాప్స్ సంఖ్యను ఎనిమిదికి తగ్గిస్తుంది. ఒక ప్రధాన ఇంప్రూవ్ మెంట్స్ విషయానికి వస్తే, కొత్త విడ్జెట్‌లు, మెరుగైన ప్రైవసీ ప్రొటక్షన్ మరియు కొత్త ఫీచర్‌లతో వస్తుంది.

కంపెనీ ప్రకారం, MIUI 14 రోల్ అవుట్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది. ఇక ఈ కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న షియోమీ ఫోన్ల విషయానికి వస్తే, Xiaomi MIX Fold 2, Redmi K50, రెడ్ మి K50 గేమింగ్ ఎడిషన్, రెడ్ మి K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్, రెడ్ మి K50 Pro మరియు Xiaomi 12 సిరీస్‌లోని అన్ని స్మార్ట్‌ఫోన్స్, Xiaomi 12 తో సహా మొదటి రౌండ్‌లో అప్‌డేట్ పొందే స్మార్ట్ ఫోన్లలో ముందున్నాయి.

ఇందులో, Xiaomi 12 Pro, మరియు Xiaomi 12S అల్ట్రా మరియు లేటెస్ట్ Xiaomi 13 సిరీస్ MIUI 14 తో లాంచ్ చేయబడుతుంది. ఏప్రిల్ 2023 లో, MIUI 14 అప్‌డేట్ Redmi Pad, Mi Pad 5 Pro మరియు Mi Pad 5 కోసం విడుదల చేయబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo