X Down: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయ్యింది.!

Updated on 13-Jan-2026
HIGHLIGHTS

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్

X డౌన్ అయినట్టు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేస్తున్నారు

సాయంత్రం 7 గంటల 38 నిమిషాల నుంచి డౌన్ అయినట్లు రిపోర్ట్

X Down: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయినట్టు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేస్తున్నారు. మేము చెక్ చేసినప్పుడు మాత్రం కొంత నెమ్మదిగా ఫీడ్ రిఫ్రెష్ అయినా వెబ్సైట్ మాత్రం బాగానే పని చేసింది. కానీ డౌన్ డిక్టేటర్ లో అందుకున్న రిపోర్ట్స్ ప్రకారం యాప్ లాగిన్ మరియు ఫీడ్ రిఫ్రెష్ వంటి మరిన్ని సమస్యలు కొంత మంది యూజర్లు చూస్తున్నట్లు చెబుతున్నారు.

X Down: ఎప్పుడు డౌన్ అయ్యింది?

ఎక్స్ ప్లాట్ ఫామ్ ఈరోజు సాయంత్రం 7 గంటల 38 నిమిషాల నుంచి డౌన్ అయినట్లు రిపోర్ట్ నమోదు అయ్యాయి. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఈ రిపోర్ట్స్ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. మేము ఈ న్యూస్ అందించే సమయానికి 5 వేలకు పైగా రిపోర్ట్స్ అందుకుంది. ఇటీవల కూడా X ప్లాట్ ఫామ్ డౌన్ అయ్యింది మరియు గత రిపోర్ట్ తో పోలిస్తే ఈసారి రిపోర్ట్స్ తక్కువగానే నమోదు అయ్యాయి.

X Down: ఎక్కడ డౌన్ అయ్యింది?

X ప్లాట్ ఫామ్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయినట్టు రిపోర్ట్ చెబుతున్నాయి. ఇందులో అధిక శాతం యూజర్లు యాప్ లో సమస్య చూసినట్లు రిపోర్ట్ చేశారు. X APP లో సమస్యలు చూసినట్లు ఏకంగా 59 శాతం మంది యూజర్లు రిపోర్ట్ చేశారు. అలాగే, వెబ్సైట్ లో ఇష్యు ఉన్నట్లు 32% శాతం మంది యూజర్లు రిపోర్ట్ చేయగా, సర్వర్ కనెక్షన్ లో సమస్య చూసినట్లు 8 శాతం మంది యూజర్లు రిపోర్ట్ చేశారు.

Also Read: 10 Minute Delivery: 10 నిమిషాల డెలివరీకి బ్రేకులు వేసిన కేంద్రం.!

మరి X ఏమి చెబుతోంది?

ప్రస్తుతానికి ఈ ఇష్యు గురించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెల్లడికాలేదు. కానీ, ఇది రెగ్యులర్ గా చూసే చిన్న సమస్య కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, మేము స్వయంగా చెక్ చేసేటప్పుడు మాత్రం యాప్ మరియు వెబ్సైట్ ఫీడ్ రిఫ్రెష్ మరియు కొత్త ఫీడ్ అప్డేట్ లో కొంత జాప్యం ఉన్నట్లు గమనించాము. అయితే, ఇది పూర్తి స్థాయిలో విఫలం అవ్వడం మాత్రం జరగలేదు.

దీన్ని బట్టి ఈ సమస్య త్వరలోనే సమసి పోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, కొందరు ఈ సమస్య గురించి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :