షావోమి యొక్క సరికొత్త ట్రిమ్మర్ తో 40 రకాల సైజులలో గడ్డం ట్రిమ్ చేసుకోవచ్చు.

షావోమి యొక్క సరికొత్త ట్రిమ్మర్ తో 40 రకాల సైజులలో గడ్డం ట్రిమ్ చేసుకోవచ్చు.
HIGHLIGHTS

ఇది 40 రకాలైన పొడవును ఎడ్జెస్టుమెంట్ చేసుకునేలా అందించినట్లు షావోమి పేర్కొంది.

ఈ రోజు కేవలం రూ.1,199 ధరతో ఇండియాలో విడుదల చేసినటువంటి, షావోమి యొక్క ట్రిమ్మర్ చాల గొప్ప ఫీచర్లతో వస్తుంది.  ఈ ట్రిమ్మింగ్ మిషన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి, ఇండియాలో విడుదలయినది. ఇది ఈ రోజు నుండి ప్రీ ఆర్డర్లను చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది. అలాగే, 27 జూన్ నుండి అమెజాన్ మరియు మీ హోమ్ లలో లభిస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్, ఒక పెద్ద రీఛార్జబుల్ బ్యాటరీ మరియు రెండు అధనపు సెట్టింగ్ కాప్స్ తో వస్తుంది.         

ఇక ఈ ట్రిమ్మింగ్ మిషన్ యొక్క విశేషాల్లోకి వెళితే, ఇది 40 రకాలైన పొడవును ఎడ్జెస్టుమెంట్ చేసుకునేలా అందించినట్లు షావోమి పేర్కొంది. అలాగే, ఇందులో అందించిన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 10 నిముషాల వరకూ వాడుకోవచ్చు. అయితే, పూర్తి ఛార్జింగుతో అత్యధికంగా 90 నిముషాల వరకూ వాడుకోవచ్చని ఈ లంచ్ ఈవెంట్లో తెలియచేశారు.

ఇందులో, ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న అన్ని రకాల ట్రెండీ గడ్డాలను సరిచేసుకునేలా ఎంపికలను అందించారు. పొడవైన, పోటిదైనా లేదా కేవలం మూడు రోజుల షేవింగ్ తరువాత వచ్చే రఫ్ గడ్డం వంటి 40 రకాలైన సైజులలో మీరు మీ గడాన్ని ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు.       

ముఖ్యంగా, ఇది డ్యూరబిలిటీ విషయంలో చాల మన్నికైనదని తెలుస్తోంది. గట్టిదనంలోనే కాకుండా నీటిలో కూడా వాడుకునేలా దీన్ని అందించింది. ఇది IPX7 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి నీటిలో తడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడడానికి చాలా స్టైలిష్ డిజైనుతో కనిపిస్తుంది మరియు ఒక్క చేత్తో కావాల్సిన పాయింట్స్ సెట్ చేసుకునేలా సౌకర్యవంతంగా ఉంటుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo