వాట్సాప్ అప్ కమింగ్ ఫీచర్ తో మరింత ఫన్..!

HIGHLIGHTS

వాట్సాప్ మరొక కొత్త ఆకర్షణీయమైన ఫీచర్ ను తీసుకువస్తోంది

మరింత ఫన్ ను జోడించనున్న ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్

మీ ప్రొఫైల్ ఫోటో మరింత ఆకర్షణీయంగా చేయ్యడానికి ఈ ఫీచర్ సహకరిస్తుంది.

వాట్సాప్ మరొక కొత్త ఆకర్షణీయమైన ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకు మరింత ఫన్ ను జోడించనున్నది ఈ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్. ఈ కొత్త ఫీచర్ యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటో కోసం 'అవతార్' ను కస్టమైజ్ చేయడానికి యాక్సెస్ అందిస్తుంది. మీ ప్రొఫైల్ ఫోటో మరింత ఆకర్షణీయమైనదిగా చేయ్యడానికి ఈ ఫీచర్ సహకరిస్తుంది. WABetaInfo ప్రకారం, అవతార్ ఫీచర్ ను లాంచ్ చెయ్యడం ద్వారా వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేజ్ ను మరింత మెరుగుపరచాలని చూస్తోంది.

వాట్సాప్ లో అవతార్ ఫీచర్ ను Android, iOS మరియు డెస్క్‌టాప్ యూజర్ల కోసం అతి త్వరలో అందించనున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. వాట్సాప్ తీసుకురాబోతున్నట్టు చెబుతున్న ఈ అవతార్ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందామా.

అసలు ఏమిటి ఈ అవతార్ ఫీచర్?

వాట్సాప్ అవతార్ ప్రొఫైల్ ఫోటో అనే ఫీచర్ కోసం పనిచేస్తోంది. వాట్సాప్ వినియోగదారులు తమ ప్రొఫైల్ ఇమేజ్‌లో కస్టమైజ్డ్ అవతార్‌ను సెట్ చేసుకోవడానికి ఫీచర్ అనుమతిస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, Android, iOS మరియు డెస్క్‌టాప్‌ లలో WhatsApp బీటా అప్ కమింగ్  అప్డేట్ తో అందుబాటులోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :