Infinix GT 30 5G ఫోన్ పై భారీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Infinix GT 30 5G పై ఫ్లిప్ కార్ట్ పై భారీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రకటించింది

ఈ స్మార్ట్ ఫోన్ ను 90FPS BGMI సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ ఇండియన్ మార్కెట్లో అందించింది

భారీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ రీసెంట్ గా విడుదల చేసిన మిడ్ రేంజ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ Infinix GT 30 5G పై ఫ్లిప్ కార్ట్ పై భారీ లిమిటెడ్ పీరియడ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 90FPS BGMI సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ ఇండియన్ మార్కెట్లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ భారీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

Infinix GT 30 5G : ఆఫర్స్

ఇన్ఫినిక్స్ జిటి 30 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ రూ. 21,999 రూపాయల ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ పై రోజు రూ. 3,500 రూపాయల స్పెషల్ కూపన్ జత చేసింది. ఈ కూపన్ ను #OnlyForYouCoupon ట్యాగ్ తో అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 925 రూపాయల ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అంటే, ఈ ఫోన్ పై ఈరోజు టోటల్ రూ. 4,425 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ మిడ్ రేంజ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మీరు కేవలం రూ. 17,574 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. అలాగే, 24 వేల రూపాయల ధరతో ఉండే ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తో కేవలం రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Samsung Smart Tv లపై మెగా డీల్ డేస్ సేల్ నుంచి మెగా డీల్స్ ప్రకటించిన అమెజాన్.!

Infinix GT 30 5G : ఫీచర్స్

ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ జతగా 8జీబీ LPDDR5x ఫిజికల్ ర్యామ్, 8జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 256 జీబీ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ

ఈ ఫోన్ కలిగిన డిస్ప్లే మరియు ప్రోసెసర్ తో 90FPS BGMI గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, గేమింగ్ కోసం ప్రత్యేకంగా GT Triggers కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక కష్టమైజబుల్ LED లైట్ సెటప్ మరియు వాటి లైట్ సెట్టింగ్ మార్చుకునే సైబర్ మెకా డిజైన్ 2.0 సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన వన్ ట్యాప్ AI బటన్ కూడా కలిగి ఉంటుంది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 64MP Sony మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మంచి వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి. ఇందులో డయల్ స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో మరియు IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :