వాట్సాప్ లో కొత్త ఫీచర్: గ్రూప్ నుండి మీరు ఎగ్జిట్ అయిన సంగతి ఎవరికీ తెలియదు..!

Updated on 06-Jul-2022
HIGHLIGHTS

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ గ్రూప్ సభ్యులకి ఉపయోగకరంగా ఉండే ఫీచర్

వాట్సాప్ గ్రూప్ నుండి మీరు ఎగ్జిట్ అయిన సంగతి ఎవరికీ తెలియకుండా చేయవచ్చు

Whatsapp నుండి మీరు ఏదైనా గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యారు అనుకోండి? వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే, మీరు ఎగ్జిట్ అయిన వెంటనే ఆ నోటిఫికేషన్ అందరికి కనిపిస్తుంది. అయితే, ఇక ముందు వాట్సాప్ గ్రూప్ నుండి మీరు ఎగ్జిట్ అయిన సంగతి ఎవరికీ తెలియకుండా చేయవచ్చు. ఇదేదో తర్డ్ పార్టీ  యాప్ తో చేసే ట్రిక్ అనుకోకండి. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అందించడంలో ముందుండే వాట్సాప్, ఇప్పుడు ఈ ఫీచర్ ను కూడా తీసుకు వస్తోంది. ఈ అప్ కమింగ్ కొత్త ఫీచర్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు మరియు గ్రూప్స్ కి ఉపయోగకరంగా ఉండేలా తీసుకువస్తోంది.

మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఆ విషయం ఆ గ్రూప్ లో వున్నా ప్రతిక్కరికీ తెలిసిపోతుంది. అయితే, కొత్త అప్డేట్ తరువాత అలా జరగదు, వాట్సాప్ ఈ ట్రెండ్ ని మారుస్తోంది. ఇప్పుడు వస్తున్న కొత్త అప్డేట్ తో మీరు ఏదైనా గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే, ఆ విషయం ఆ గ్రూప్ లోని ఇతరులకు తెలియదు. అంటే, మీరు ఎవరికీ తెలియకుండా ఏ గ్రూప్ నుండైనా ఎగ్జిట్ కావచ్చు. మీరు ఎగ్జిట్ అయిన విషయం కేవలం గ్రూప్ అడ్మిన్ కు మాత్రమే తెలుస్తుంది. మీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఎవరికీ వెళ్లదు, ఇది ఈ కొత్త అప్‌డేట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం.

ఈ కొత్త ఫీచర్ మరియు అప్డేట్ గురించి WABetainfo సమాచారం అందించింది. WABetainfo ఈ విషయాన్ని బ్లాక్ ద్వారా పోస్ట్ చేసింది. అంతేకాదు, వాట్సాప్‌ లో ఈ ఫీచర్‌ను త్వరలో వినియోగదారులకు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వారికీ ఈ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ ఫీచర్ ఇటీవలే బీట్ వెర్షన్ లో అంధుబాటులోకి వచ్చింది. వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ ఉపయోగంలోకి వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :