Whatsapp లో Red Tick వస్తే కేస్ అయినట్టా: అసలు నిజం ఇది?

Whatsapp లో Red Tick వస్తే కేస్ అయినట్టా: అసలు నిజం ఇది?
HIGHLIGHTS

Whatsapp లో Red Tick వస్తే కేస్ అయినట్టేనా

కొత్త చట్టాల ప్రకటన తర్వాత ఈ ప్రచారం వెలుగులోకి వచ్చింది

షోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న కొత్త ప్రచారం

Whatsapp లో Red Tick వస్తే కేస్ అయినట్టే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే ప్రశ్న ఇప్పుడు మీకు కూడా ఉండవచ్చు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే, కొత్త IT రూల్స్ ను మరియు కొత్త చట్టాల ప్రకటన తర్వాత ఈ ప్రచారం వెలుగులోకి వచ్చింది.  అయితే, ఇది ఇంకా అమలులోకి రాకముందే చాలా మంది దీని పైన ఏవోవే చెబుతున్నారు. మరి ఈ విషయాలు ఎంత వరకూ నిజమో తెలుసుకుందాం.

ప్రస్తుతం, షోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న కొత్త ప్రచారం Whatsapp మెసేజ్ పైన కొత్తగా కనిపిస్తునట్లు చెబుతున్న మూడు టిక్స్. ఇందులో, రెండు బ్లూ టిక్స్ కాగా మరొకటి రెడ్ కలర్ చూపిస్తున్నారు. ఇందులో చూపిస్తున్న రెడ్ టిక్ అర్ధం గవర్నెమెంట్ మీరు పంపిన మెసేజ్ ఫేక్ గా గుర్తించి మీ పైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతుందని చెబుతున్నారు. చూడడానికి ఈ న్యూస్ చాలా గంభీరంగా మరియు నిజమైన దానిలా వున్నా ఇది నిజం కాదు. ఇది అక్షరాలా ఫేక్ మెసేజ్ మాత్రమే, దీని గురించి ఎవరూ బయపడాల్సిన పనిలేదు.

వాస్తవానికి, ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని అరికట్టడానికే ప్రభుత్వం కొత్త IT చట్టాలను తీసుకొచ్చింది. అయితే, ఇందులో వినియోగదారు ప్రైవసీ కి భంగం వాటిల్లే ప్రమాధం వుందని Whatsapp తో సహా పలు కంపనీలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ కొత్త ఇంటర్నెట్ నిబంధనలను సవాలు చేస్తూ, వాట్స్అప్ ఏకంగా న్యూ ఢిల్లీ హైకోర్ట్ లో కేస్ ను కూడా ఫైల్ చేసింది. ప్రభుత్వం Whatsapp మెసేజ్ లతో పాటుగా ఇంటర్నెట్ క్లాస్ కూడా ట్రాక్ చేస్తోంది, అని వస్తున్న వార్తలు కూడా పూర్తిగా ఫేక్.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo