మెటా ఆద్వర్యం లోని Whatsapp యూజర్ల కోసం మరొక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలిపింది. కొత్త అప్డేట్స్ మరియు మరింత సెక్యూర్ అనుభవాన్ని అందిచడానికి నిరంతరం ప్రయత్నించే వాట్సాప్, ఇప్పుడు ఇదే దారిలో మరొక కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది. భవిష్య కాలంలో రానున్న అప్డేట్ ద్వారా ఈ కొత్త ఫీచర్ ను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు wabetainfo వెల్లడించింది. వాట్సాప్ లో పరిచయం కాబోతున్నట్లు చెబుతున్న ఆ కొత్త ఫీచర్ వివరాలేమిటో తెలుసుకోండి.
వాటప్ లో ప్రస్తుతం ఫోన్ నెంబర్, పేరు మరియు అబౌట్ వంటి వివరాలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే, వాట్సాప్ వీటితో పాటుగా User Name (యూజర్ నేమ్) పేరుతో కొత్త ఫీచర్ ను కూడా జత చేస్తుందని ఈ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ ను సూచిస్తూ పంచుకునే స్క్రీన్ షాట్ లో 'Choose My Username' ను ప్రొఫైల్ పేజ్ లో జత చేసినట్లు చూపించింది. ఇందులో @ తో ప్రారంభమయ్యేలా నచ్చిన పేరును మీరు సెట్ చేసుకోవచ్చు మరియు ఇది మీ యూజర్ నేమ్ గా చలామణి అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు నెంబర్ బదులుగా యూజర్ నేమ్ ను చెబితే సరిపోతుంది.
ఈ ఫీచర్ యాడ్ అయిన తరువాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి యూజర్ ప్రొఫైల్ ను ఎంచుకోగానే మీకు ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. అయితే, ఇది కొత్త అప్డేట్ తో ప్రకటిన వెలువడిన తరువాత మాత్రమే మీరు మీ ఫోన్ లో చూడగలుగుతారు. ఈ కొత్త అప్డేట్ నెంబర్ ను కూడా ఈ నివేదిక వెల్లడించింది. Android 2.23.11.15 అప్డేట్ లో ఈ కొత్త యూజర్ నేమ్ ఫీచర్ వస్తుందని సూచించింది.
ఈ ట్వీట్ ను మీరు క్రింద చూడవచ్చు.
WhatsApp beta for Android 2.23.11.15: what's new?
— WABetaInfo (@WABetaInfo) May 24, 2023
WhatsApp is working on a feature to set up a WhatsApp username, and it will be available in a future update of the app!https://t.co/2yMpvlvkdo pic.twitter.com/s60sQdy9jP
ఇక ఇటీవల వచ్చిన లేటెస్ట్ అప్డేట్ లో Whatsapp Chat Lock ఫీచర్ ను జత చేసిన విషయం తెలిసిందే మరియు ఇది చాలా మంది యూజర్లకు అంధుబాటులోకి వచ్చింది.