Whatsapp: రెండు ఫోన్లలో ఒకే నంబర్ తో వాట్సాప్.. కొత్త ఫీచర్ తెలుసుకోండి.!

Whatsapp: రెండు ఫోన్లలో ఒకే నంబర్ తో వాట్సాప్.. కొత్త ఫీచర్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

వాట్సాప్ యాప్ లో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు జత చేస్తూనే వుంది

వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది

ఈ కొత్త ఫీచర్ యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోండి

యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందించడానికి సహాయం చేసేలా, వాట్సాప్ యాప్ లో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు జత చేస్తూనే వుంది. అదేదారిలో, వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.  ఈ ఫీచర్ తో రెండు ఫోన్లలో ఒకే నంబర్ తో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. ఇటీవల తీసుకొచ్చిన Linked Device  ఫీచర్ కు ఇది అదనపు ఫీచర్. ఈ కొత్త ఫీచర్ యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోండి. 

వాట్సాప్ కొత్త ఫీచర్:

వాట్సాప్ యూజర్లు కేవలం ఒక ఫోన్ లో మాత్రమే వారి మొబైల్ నంబర్ తో వారి వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం వుంది. అయితే, ఇప్పుడు తీసుకువస్తున్న వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే, ఇటీవల విడుదల చేసిన లింక్డ్ డివైజ్ లకు ఇది బిన్నం. ఎందుకంటే, వాట్సాప్ యూజర్లు వారి ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్‌లు వంటి నాలుగు ఇతర పరికరాలకు వారి అకౌంట్ లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, కంపెనీ ఇప్పుడు రెండు ఫోన్లలో ఒక వాట్సాప్ నంబర్‌కు లాగిన్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ తో డ్యూయల్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ అకౌంట్ వాడకం మరింత సులభతరం చేస్తుంది.

ఇక వాట్సాప్ తీసుకురావాలని కూడా యోచిస్తోంది. ఈ ఫీచర్ విషయానికి వస్తే, ఒక నిర్దిష్ట అకౌంట్ ప్రస్తుతం ఎన్ని డివైజ్‌ లలో లాగిన్ చేయబడిందో చెక్ చేయడానికి WhatsApp ఒక మార్గాన్ని అందిస్తుంది. వారి లాగిన్ వివరాలను ధృవీకరించడానికి వాట్సాప్ యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది మరియు వారి అకౌంట్ పైన మరింత భద్రతను ఇస్తుంది.

ఒకేసారి 2 మొబైల్ ఫోన్‌ లలో ఒకే వాట్సాప్ నంబర్

WhatsApp యొక్క ఈ కొత్త ఫీచర్‌ను ప్రయత్నించాలనుకునే మీరు ముందుగా మెసేజింగ్ యాప్ యొక్క బీటా వెర్షన్ కోసం సైన్ అప్ చేయాలి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo