Whatsapp లో కొత్త అవతార్ ఫీచర్ వస్తోంది.!!

HIGHLIGHTS

Whatsapp మరొక కొత్త ఫీచర్ ను యాడ్ చెయ్యబోతోంది

ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకు మరింత ఫన్ యాడ్ అవుతుంది

ప్రొఫైల్ ఇమేజ్‌లో కస్టమైజ్డ్ అవతార్‌ను సెట్ చేసుకోవడానికి ఫీచర్ అనుమతిస్తుంది

Whatsapp లో కొత్త అవతార్ ఫీచర్ వస్తోంది.!!

వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి మరొక కొత్త ఫీచర్ ను యాడ్ చెయ్యబోతోంది. అదే, వాట్సాప్ అవతార్ ఫీచర్ మరియు ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకు మరింత ఫన్ యాడ్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ వచ్చిన తరువాత యూజర్లు వారి ప్రొఫైల్ ఫోటో యొక్క 'అవతార్' ను పూర్తిగా నచ్చినట్లుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే, మీ ప్రొఫైల్ ఫోటో ను అందరూ మెచ్చుకునేలా మరింత ఆకర్షణీయమైనదిగా చేయ్యడానికి ఈ ఫీచర్ సహకరిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

WABetaInfo ప్రకారం, అవతార్ ఫీచర్ ను లాంచ్ చెయ్యడం ద్వారా వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేజ్ ను మరింత మెరుగుపరచాలని చూస్తోంది. వాట్సాప్ లో అవతార్ ఫీచర్ ను Android, iOS మరియు డెస్క్‌టాప్ యూజర్ల కోసం అతి త్వరలో అందించనున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. వాట్సాప్ తీసుకురాబోతున్నట్టు చెబుతున్న ఈ అవతార్ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందామా.

అసలు ఏమిటి ఈ అవతార్ ఫీచర్?

వాట్సాప్ అవతార్ ప్రొఫైల్ ఫోటో అనే ఫీచర్ కోసం పనిచేస్తోంది. వాట్సాప్ వినియోగదారులు తమ ప్రొఫైల్ ఇమేజ్‌లో కస్టమైజ్డ్ అవతార్‌ను సెట్ చేసుకోవడానికి ఫీచర్ అనుమతిస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, Android, iOS మరియు డెస్క్‌టాప్‌ లలో WhatsApp బీటా అప్ కమింగ్  అప్డేట్ తో అందుబాటులోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.      

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo